India-China face off
India-China face off: భారత్-చైనా సైనికుల మధ్య ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ లోక్‌సభలో ప్రకటన చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో ఈ నెల 9న భారత్-చైనా సైనికుల ఘర్షణ చోటుచేసుకుందని చెప్పారు. చైనా సైనికులు భారత భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించారని, వారి ప్రయత్నాలను మన సైనికులు తిప్పికొట్టారని అన్నారు.
ఈ ఘర్షణలో మన సైనికులు ఎవరూ చనిపోలేదని, వారికి తీవ్రగాయాలూ కాలేదని వివరించారు. భారత సైనికులు ధైర్య, సాహసాలను ప్రదర్శించారని, వారిని అభినందించాల్సిందేనని వ్యాఖ్యానించారు. చైనా కుతంత్రానికి మన సైనికులు దీటుగా సమాధానం ఇచ్చారని చెప్పారు. సరైన సమయానికి భారత మిలటరీ కమాండర్లకు జోక్యం చేసుకుని, చైనాతో చర్చలు జరపడంతో చైనా సైనికులు వెనక్కి వెళ్లిపోయారని తెలిపారు.
కాగా, ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై చర్చ కోసం ఇవాళ కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నజీర్ హుస్సేన్ స్వల్పకాలిక చర్చకు 176 నిబంధన కింద రాజ్యసభలో నోటీసు ఇచ్చారు. మరోవైపు లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ వాయిదా తీర్మానం ఇచ్చారు. భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న అంశంపై సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
India China Border Dispute: భారత్ – చైనా సరిహద్దు వివాదం.. ప్రధాని మోదీపై సంజయ్ రౌత్ విమర్శలు