Rice Export
Rice Export : సింగపూర్ దేశానికి బియ్యం ఎగుమతికి భారతదేశం అనుమతించింది. సింగపూర్ దేశంతో ప్రత్యేక సంబంధాల దృష్ట్యా సింగపూర్ వాసుల ఆహార భద్రతా అవసరాలను తీర్చడానికి బియ్యం ఎగుమతిని అనుమతించిందని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. బియ్యం దేశీయ ధరలను స్థిరంగా ఉంచడానికి జులై 20వతేదీ నుంచి బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిని భారత్ నిషేధించింది. ( India Decides To Allow Rice Export)
Chandrayaan-3 : చంద్రుడిపై ఆక్సిజన్..!
‘‘ భారత్, సింగపూర్ దేశాల మధ్య ఉన్న సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యం, సన్నిహిత ఆర్థిక సంబంధాలను దృష్టిలో ఉంచుకొని సింగపూర్ దేశానికి బియ్యం ఎగుమతిని అనుమతించాలని భారత నిర్ణయించింది’’ అని విదేశీ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు. (Rice Export To Singapore)
కొన్ని రకాలపై పరిమితులు విధించినప్పటికీ, ప్రస్తుత సంవత్సరంలో బియ్యం ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. జులై 20వతేదీన కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతి నిబంధనలను సవరించి బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని నిషిద్ధ కేటగిరీలో చేర్చింది. అయితే సింగపూర్ దేశానికి మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయిస్తూ బియ్యం ఎగుమతికి భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.