ప్రపంచాన్ని ప్రాణాంతక కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. ఏ క్షణంలో వైరస్ తీవ్రత పెరుగుతుందోనన్న భయంతో ప్రపంచ దేశాల ప్రజలంతా ప్రాణాల్నీ గుప్పిట్లో పట్టుకుని జీవిస్తున్నాయి. ఎప్పుడు ఏవైపు నుంచి కరోనా కాటేస్తుందోనని హడలి చస్తున్నారు. కరోనా వైరస్.. పుట్టక చైనాలోని వుహాన్ సిటీలో వెలుగులోకి వచ్చింది. అక్కడ నుంచి ప్రపంచ దేశాలకు పాకింది.
ఇప్పుడు ఇండియలోకి కూడా వైరస్ ప్రవేశించిదంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవలే చైనాకు వెళ్లొచ్చిన చాలామందిలో ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయంటున్నారు. కరోనా వైరస్ మూలం ఎక్కడ? అదేలా మనుషులకు వ్యాపించింది అనే కోణంలో సైంటిస్టులు, పరిశోధనలు, అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఈ వైరస్ బారిన పడి 106 మంది ప్రాణాలు కోల్పోగా 2700 మందికి ఈ వైరస్ సోకినట్టు కేసులు నమోదయ్యాయి.
కరోనాకు మందు ఉంది.. భయపడొద్దు :
ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్ కు ఎలాంటి వ్యాక్సీన్ లేదు.. కనీసం యాంటీ ట్రీట్ మెంట్ కూడా అందుబాటులో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైరస్ బారి నుంచి ఎలా బయటపడాలని అని ప్రపంచ దేశాలు ఆలోచిస్తున్న తరుణంలో ఇండియాలోని తమిళనాడుకు చెందిన సిద్ధా వైద్యుడు ఒకరు కరోనా వైరస్ కు మందు కనిపెట్టానంటూ వెల్లడించాడు. తాను తయారుచేసిన హెర్బల్ మెడిసిన్ సాయంతో కరోనా వైరస్ ఇట్టే నయం చేస్తానంటున్నాడు. చెన్నైలోని రత్నా సిద్ధా ఆస్పత్రికి చెందిన థానికాచలమ్ వేణి అనే వైద్యుడు కరోనా వైరస్ మందు కనిపెట్టినట్టు చెబుతున్నాడు. ఈ సిద్ధా, ఆయుర్వేదిక్ మెడిసిన్లలో తనకు 25 ఏళ్ల అనుభవం ఉందని అంటున్నాడు.
Read Also : పూర్తి Visual Guide మీకోసం: ‘కరోనా’ వ్యాప్తికి అసలు కారణాలు ఇవే!
ఈ సందర్భంగా వైద్యుడు వేణి మీడియాతో మాట్లాడుతూ..‘హెర్బల్ ఆయిల్ నుంచి ఒక ఔషధాన్ని తయారుచేశాం. ఈ మందు.. ఏ రకమైన వైరల్ జ్వరం లేదా ఎంత ప్రాణాంతకమైన రోగమైనా సరే ఇట్టే నయమైపోతుంది. కరోనా వైరస్ కు ఎలాంటి మందు లేదు. 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధిని ఎలా నయం చేయాలో కూడా నిపుణులకు తెలియదు. మా హెర్బల్ extract మెడిసిన్.. డెంగ్యూ వంటి విష జర్వాలు మాత్రమే కాదు.. ఆర్గాన్ ఫెల్యూర్, తీవ్రమైన లివర్ ఫీవర్ వంటి వ్యాధులను కూడా సులభంగా నయం చేస్తుంది’ అని ఆయన చెప్పుకొచ్చారు.
24 గంటల నుంచి 40 గంటల్లో నయం చేస్తాం :
‘ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), చైనా ప్రభుత్వానికి మేం ఒక్కటే చెప్పాలనుకుంటున్నాం. మా మెడిసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మల్టీ ఆర్గాన్ ఫెల్యూర్ వంటి వ్యాధులను వెంటనే నయం చేస్తుంది. కరోనా వైరస్ జ్వరాన్ని కూడా ఇట్టే నయం చేసేస్తుంది’ అని తెలిపారు. సిద్ధా వైద్యులైన వేణి మాట్లాడుతూ.. ఇన్ఫిక్షన్లకు కారణమయ్యే వైరస్ నిర్మూలించేందుకు తన బృందంతో కలిసి కరోనా వైరస్ మందును తయారుచేసినట్టు తెలిపాడు. ఈ మందు 24 గంటల నుంచి 40 గంటల్లోగా వైరస్ లక్షణాలను పూర్తిగా తగ్గిస్తుందని తెలిపాడు. డెంగీ జ్వరంతో ప్లేట్ లేట్స్ కౌంట్ పడిపోవడం, లివర్ ఫెల్యూర్, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, తక్కువ తెల్లరక్త కణాలు (WBC)ను 24 గంటల నుంచి 40 గంటల్లో క్యూర్ చేసినట్టు వేణి తెలిపారు. కరోనా వైరస్ విషయంలో కూడా తమ మెడిసిన్ అధ్భుతంగా పనిచేస్తుందని నొక్కి చెబుతున్నారు.
అవకాశమిస్తే సాయం చేస్తాం : అవసరమైతే చైనాకు కూడా :
ఈ కరోనా వైరస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్ కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే చైనాలోని వైరస్ బాధితులకు కూడా తమ ఔషధంతో చికిత్స అందిస్తామని చెబుతున్నాడు. కానీ, ఇప్పటివరకూ తమిళనాడులో ఈ కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదని, ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి. విజయభాస్కర్ తెలిపారు. వైరస్ వ్యాప్తి కాకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టుగా మంత్రి తెలిపారు. కరోనా వైరస్.. ఎలాంటి వ్యాక్పీన్ లేదు. జపాన్ లో జనవరి 16న ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది. కానీ, చైనాలో తొలి కేసు నమోదు కాగా, ఆ తర్వాత మిగతా దేశాల్లోనూ ఈ వైరస్ పాకింది.
కరోనా వైరస్ లక్షణాలు ఇవే :
కరోనా వైరస్ సోకినట్టు ఇతర జ్వరాల మాదిరిగానే సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. శ్వాసపరమైన సమస్యలు తలెత్తుతాయి. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోలేరు. కొన్ని తీవ్రమైన కేసుల్లో సోకిన ఇన్ఫిక్షన్ న్యూమోనియాకు దారితీసే ప్రమాదం ఉంది. తీవ్ర శ్వాసకోశ సమస్యలు, కిడ్నీ ఫెల్యూర్ కావడం .. చివరికి మరణానికి కూడా దారి తీస్తుంది.
Read Also : సైంటిస్టులు కనిపెట్టేశారు:Coronavirus వెనుక షాకింగ్ రీజన్స్!