అమెరికా ఎన్నికల్లో రాజా,ప్రమీల ఘన విజయం
- venkaiahnaidu
- Published On : November 4, 2020 / 12:48 PM IST
Indian-Origin Congressman Wins US House Race భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి వరుసగా మూడోసారి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన.. 71 శాతం ఓట్లు కైవసం చేసుకుని ప్రత్యర్థి ప్రెస్టన్ నెల్సన్పై విజయం సాధించారు.
ఢిల్లీలో జన్మించిన కృష్ణమూర్తి.. 2016లో ప్రతినిధుల సభకు మొదటిసారి ఎన్నికయ్యారు. కృష్ణమూర్తి తల్లిదండ్రులు తమిళనాడుకు చెందినవారు.
మరోవైపు, భారత సంతతికి చెందిన ప్రమీల జయపాల్ వాషింగ్టన్ రాష్ట్రం నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించారు. మరో భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా కూడా మూడోసారి గెలిచేందుకు ఉవ్విల్లూరుతున్నారు.
