Indian in America: అమెరికా పార్కులో కూర్చొన్న భారత సంతతి వ్యక్తి హత్య
భారత సంతతికి చెందిన 31ఏళ్ల వయస్సున్న వ్యక్తిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అద్దెకు తీసుకున్న SUVని పార్క్ చేసుకుని కూర్చొని ఉన్నాడు. అంతలో తుపాకీ గుండు తలలోకి దూసుకెళ్లింది. శనివారం సాయంత్రం 3గంటల 45నిమిషాల సమయంలో ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.
- Subhan Ali Shaik
- Published On : June 27, 2022 / 02:46 PM IST
Gun Fire
Indian in America: భారత సంతతికి చెందిన 31ఏళ్ల వయస్సున్న వ్యక్తిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అద్దెకు తీసుకున్న SUVని పార్క్ చేసుకుని కూర్చొని ఉన్నాడు. అంతలో తుపాకీ గుండు తలలోకి దూసుకెళ్లింది. శనివారం సాయంత్రం 3గంటల 45నిమిషాల సమయంలో ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.
సౌత్ ఓజోన్ పార్క్ సమీపంలో బ్లాక్ జీప్ రాంగ్లర్ సహారా వాహనం పార్క్ చేసి సత్నం సింగ్ అనే వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అంతలో తుపాకీ పట్టుకుని ఓ వ్యక్తి అక్కడికి వచ్చి కాల్పులు జరిపాడు. మృతుడు ఘటనాస్థలానికి సమీపంలోనే ఉండేవాడని పోలీసులు వెల్లడించారు. ఛాతి, మెడ బిగుసుకుపోవడంతో స్థానిక హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు ట్రీట్మెంట్ చేస్తుండగా మృతి చెందాడు.
మరో వ్యక్తిని పికప్ చేసుకునేందుకు సత్నం కారు అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది.
Read Also : అమెరికాలో మరోసారి కాల్పులు..బాలుడు మృతి
నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. హంతకులు SUV యజమానిని హత్య చేసేందుకు వచ్చారని కారులో కూర్చొన్న వ్యక్తిని గమనించకుండా కాల్పులు జరిపారని చెబుతున్నారు. సిల్వర్ కలర్ వాహనంలో వచ్చిన కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది.
