లాస్ ఏంజిల్స్ కాల్పుల్లో భారతీయుడి మృతి

భారతీయుడిపై అమెరికన్లు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే మృతిచెందాడు ఈ ఘటన శనివారం లాస్ ఏంజిల్స్‌లో తెల్లవారుజామున జరిగింది. మహీందర్ సింగ్ సాహి(31)ఇద్దరు పిల్లల తండ్రి.. సాహి ఆరు నెలల క్రితమే అమెరికా వెళ్లాడు. విట్టియర్ సిటీలో ఉన్న 7-ఎలెవన్ గ్రాసరీ స్టోర్‌లో  పనిపచేస్తున్నాడు. 

అతని సంపాదనతోనే కుటుంబం నడుస్తుంది. అతని ఖర్చులు కాకుండా మిగిలిన డబ్బును కుటుంబానికి పంపిస్తుంటాడు. శనివారం తెల్లవారుజామున మాస్క్‌తో ఉన్న వ్యక్తి గన్‌తో దొంగతనం చేసేందుకు స్టోర్ లోకి ప్రవేశించాడు. కారణం లేకుండానే ఫైర్ చేసేశాడు. 

ఆ సమయంలో షాప్‌లో ఉన్న ఇద్దరు కస్టమర్లు కూడా గాయాలకు గురయ్యారు. ఆ వ్యక్తి ముసుగేసుకుని గుర్తు పట్టలేనట్లుగా ఉన్నాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. మృతుడి సోదరుడు అమెరికాలో ఉంటూ GoFundMe page ద్వారా నిధులు సమకూర్చి భారత్ తీసుకురావాలని చూస్తున్నారు. 

‘పేరెంట్స్‌ను, భార్యతో పాటు 5, 9ఏళ్ల వయస్సున్న పిల్లలను వదిలేసివెళ్లిపోయాడు. శవాన్ని భారత్ పంపేందుకు మాకు సాయం కావాలని కోరుతున్నాం. అతని కుటుంబానికి చివరిచూపు దక్కించడం కోసం ప్రయత్నిస్తున్నాం’ అని GoFundMe pageకు లేఖ ద్వారా విన్నవించుకున్నాడు.