×
Ad

అమెరికాలో తెలుగు మూలాలున్న విద్యార్థి అరెస్ట్.. కుటుంబ సభ్యులే ఫిర్యాదు.. ఇంట్లో ఆ పని చేయడమే కారణం..!

Indian Student Arrested In US : భారత సంతతికి చెందిన విద్యార్థిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి తెలుగు మూలాలున్నట్లు సమాచారం.

Indian Student Arrested In US

Indian Student Arrested In US : భారత సంతతికి చెందిన యువకుడిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి తెలుగు మూలాలున్నట్లు సమాచారం. అయితే, సొంత కుటుంబ సభ్యులే అతనిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకిదిగి అతన్ని అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : Duvvada Srinivas : నాపై దాడికి కుట్ర.. అర్ధరాత్రి దువ్వాడ శ్రీనివాస్ హల్‌చల్.. వారిపై ఫైర్.. సెల్ఫీ వీడియో రిలీజ్..

టెక్సాస్ యూనివర్శిటీలో చదువుతున్న 22ఏళ్ల మనోజ్ సాయి లేళ్ల అనే భారత సంతతి యువకుడ్ని కొల్లిన్ కౌంటీ పోలీసులు అరెస్టు చేశారు. తరచూ తమపై బెదిరింపులకు దిగుతూ, దాడి చేస్తున్నాడని, తమ ఇంటికి నిప్పు పెట్టడానికి ప్రయత్నించాడని అతడి కటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొల్లిన్ కౌంటీ పోలీసులు మనోజ్ సాయి లేళ్లను అరెస్టు చేశారు.

యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ లో సీనియర్ విద్యార్థిగా చదువుతున్న మనోజ్ సాయి లేళ్ల కొంతకాలంగా మానసిక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. మనోజ్ తమను తీవ్రంగా బెదిరిస్తున్నాడని, గత కొన్నిరోజుల క్రితమే ఇంటికి నిప్పు పెట్టేందుకు కూడా ప్రయత్నించాడని కుటుంబ సభ్యులు పోలీసుల వద్ద వాపోయారు.

మనోజ్ సాయిపై పోలీసులు ప్రధాన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇంటిని ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో ఓ ప్రార్థనా స్థలంలో నిప్పు పెట్టడం, కుటుంబ సభ్యులపై ఉగ్ర బెదిరింపులకు దిగడం. అయితే.. మనోజ్ వల్ల ఏ ప్రార్థనా స్థలానికి ముప్పు ఉన్నట్లు ఆధారాలు లేవని, చట్టపరమైన సెక్షన్ల ప్రకారం ఆ అభియోగం నమోదైందని పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం మనోజ్ కొల్లిన్ కౌంటీ జైలులో ఉన్నాడు. ఇంటికి నిప్పు పెట్టినందుకుగాను.. 1,00,000 డాలర్లు, బెదిరింపుల కేసులో 3,500 డాలర్ల చొప్పున కోర్టు బాండ్‌ మొత్తాన్ని నిర్ణయించింది. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.