మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు ఎంపిక

మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్‌కు జరుగనుంది.

  • Publish Date - January 13, 2020 / 02:21 AM IST

మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్‌కు జరుగనుంది.

మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్‌కు జరుగనుంది. స్టార్‌ ప్లేయర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ భారత జట్టుకు నాయకత్వం వహించనుంది. 15 మంది సభ్యుల జట్టులో బెంగాల్‌ బ్యాట్స్‌విమన్‌ రిచా హోష్‌ మాత్రమే కొత్త ప్లేయర్‌ కావడం విశేషం. 

ఇటీవల జరిగిన విమెన్స్‌ ఛాలెంజర్‌ ట్రోఫీలో మెరుపులు మెరిపించిన రిచా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించింది. గత కొద్దిరోజులుగా అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న 15ఏండ్ల స్కూల్‌ గర్ల్‌ షఫాలీ వర్మ కూడా తొలిసారి మెగా ఈవెంట్‌లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది.

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఆస్ట్రేలియా వేదికగా ఫిబ్రవరి 21న ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తున్న ట్రైసిరీస్‌కు కూడా 16 మంది సభ్యుల జట్టును సెలక్టర్లు ప్రకటించారు. జనవరి 31 నుంచి టోర్నీ జరుగగా ఇంగ్లాండ్‌ కూడా సిరీస్‌లో పాల్గొననుంది.