‘చెడ్డీస్’: oxford డిక్షనరీలో భారతీయ పదం

  • Publish Date - March 22, 2019 / 03:51 AM IST

దేనికైనా ఎక్కడో ఒకచోట ప్రారంభం కావాలి. సరికొత్త ఆలోచనలకు నాంది పలకాలి. ఆ ఆలోచనలు. ఆ పదాలు సరికొత్తగా వుండాలి. అంతేకాదు  అవి అందరికీ అందుబాటులో వుండాలి. అందరూ ఉచ్ఛరించేలా (పలికేలా) వుండాలి. దీనికోసం ఓ ప్రత్యేక వేదిక వుండాలి. సరికొత్త పదాలకు, ఆ పదాలను పుట్టించే ఆలోచనలు ఆక్స్ ఫర్డ్ సొంతం. మరి ఈ సంవత్సం ఆక్స్ ఫర్డ్  సరికొత్త పదాల్ని తెచ్చేసింది. ఆక్స్ ఫర్డ్ నిఘంటువు (డిక్షనరీ)కి  ప్రపంచం వ్యాప్తంగా  ప్రత్యేక గుర్తింపు ఉంది. అనేక భాషల నుంచి విస్తృతంగా వాడుకలో ఉన్న పదాలను కూడా ఇంగ్లీష్ లాంగ్వెజ్ లో పొందుపరిచే ప్రయత్నాలు చేయటంలో ఆక్స్ ఫర్డ్ ఎక్స్ పర్ట్.  ఇప్పటివరకు ఎన్నో భారతీయ పదాలు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో చోటు దక్కించుకున్నాయి. ఈ క్రమంలో భారతదేశానికి చెందిన మరో పదానికి చోటు దక్కింది. అదే ‘చెడ్డీస్’. ఇప్పటికే ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో అచ్చమైన తెలుగు పదాలు ’అయ్యో,అన్న, అచ్చా, తెలంగాణ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకమైన బోనాలు,బతుకమ్మ,కూడా ఉండటం మరో విశేషం.
Read Also : హలో ఈసీ : హెల్ప్ లైన్ 1950 స్పెషల్ అదే

భారతీయులు లోదుస్తులు (ఇన్నర్ వేర్) అనే అర్థం వచ్చేలా పలికే ‘చడ్డీస్’ అనే పదాన్ని కూడా ఆక్స్ ఫర్డ్ నిఘంటువులో పొందుపరిచారు. చడ్డీస్ అనే పదానికి షార్ట్ ట్రౌజర్స్, అండర్ ప్యాంట్స్, షార్ట్స్ అనే అర్థాలు కనిపిస్తాయి. ఉత్తర భారతంలో బాగా ప్రాచుర్యం పొందిన ఈ పదం  ఆనాటి బ్రిటీష్ పాలకులకు కూడా సుపరిచితమే. ఎందుకంటే భారత్ ను వారు వందల సంవత్సరాల పాటు పరిపాలించారు కాబట్టి. భారత్ లో బ్రిటీష్ పాలన కొనసాగిన కాలంలో వారి అధికారిక గెజిట్లు, ఇతర ప్రచురణల్లో చడ్డీస్ పదాన్ని ఉపయోగించేవారట. 
 

1990వ దశకంలో బీబీసీ టెలివిజన్‌లో ప్రసారమైన బ్రిటిష్-ఆసియన్‌ కామెడీ సిరీస్‌ ‘గుడ్‌నెస్‌ గ్రేసియస్‌ మి’లో నటులు కూడా ‘చెడ్డీస్’ అనే పదం వాడటంతో దీనికి బాగా మరింత ప్రాముఖ్యత వచ్చింది. తిరస్కరణ, అసహ్యం  వంటి భావాలను వ్యక్తం చేసేటప్పుడు ‘కిస్‌ మై చెడ్డీస్’ అనే వర్డ్ ను ఉపయోగిస్తారని అక్స్‌ఫర్డ్‌ పేర్కొంది. అక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ తాజాగా చేసిన అప్‌డేట్‌లో 650 పదాలను కొత్తగా చేర్చగా వాటిలో ‘భారతీయ పదం చెడ్డీస్ ఒకటి కావటం విశేషం. 
Read Also : కార్బైడ్‌ ఉపయోగిస్తే కఠిన చర్యలే : హైకోర్టు కీలక ఆదేశాలు