భారత్‌కు భూటాన్ షాక్ : ఇక్కడకు వస్తే..ఇండియన్స్ ఫీజు చెల్లించాల్సిందే

  • Publish Date - February 5, 2020 / 11:39 AM IST

ఇండియన్ తమ దేశానికి వస్తున్నారా..అయితే..ముందుగా రూ. 1200 చెల్లించాల్సిందేనంటోంది భూటాన్. ఇందుకు దిగువ సభ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఈ నిబంధన ఇప్పటి నుంచి మాత్రం కాదు. జులై నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. కానీ..ఈ బిల్లు భూటాన్ నేషనల్ అసెంబ్లీలో ఇంకా చర్చల్లోనే ఉందని..ఈ ఫీజు నామమాత్రంగా పెరిగే అవకాశం ఉందని భారత అధికారులు వెల్లడిస్తున్నారు. 

భూటాన్ దేశానికి పర్యాటకుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఇది హిమాలయల దేశం. ఉచితంగానే ప్రవేశం కల్పిస్తోంది. భారత పర్యాటకులకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. భూటాన్‌కు మద్దతుగా పలు సందర్భాల్లో భారత్ చైనాను ఎదురించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్, మాల్దీవులు, భారత్ నుంచి అధికంగా ఇక్కడకు వస్తుంటారు. 2018 సంవత్సరానికంటే 2019లో 10 శాతం పెరిగిపోయిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది భూటాన్.

పర్యాటకులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం కోసం, ఆధాయం పెంచుకోవడం కోసం, దేశ సుస్థిరాభివృద్ధి కోసం నిర్ణీత ఫీజును వసూలు చేయాలని నిర్ణయం తీసుకుని చర్యలు తీసుకొంటోంది. భారత పర్యాటకులు ఎక్కువగా పశ్చిమ ప్రాంతాన్నిసందర్శిస్తుంటారు.