Ban On Rice Export : ఆస్ట్రేలియాలోను అమెరికాలాంటి ఘటనలే.. బియ్యం కోసం ఎగబడుతున్న భారతీయులు

భారత్ నుంచి బియ్యం ఎగుమతులపై నియంత్రణ ఏర్పడటంతో విదేశాల్లో ఉండే భారతీయులు కటకటలాడిపోతున్నారు. బియ్యం కొనేందుకు పోటీలు పడుతున్నారు. అమెరికా, కెనాడాలతో పాటు తాజాగా ఆస్ట్రేలియాలో కూడా బియ్యం కోసం జనాలు స్టోర్లకు ఎగబడుతున్నారు.

India's Ban On Rice Export..Australia

India Ban On Rice Export : అమెరికాలో పరిస్థితే ఆస్ట్రేలియాలో కూడా కనిపిస్తోంది. బియ్యం అమెరికాలో భారతీయులు (Indians) స్టోర్లకు ఎలా ఎగబడి బస్తాలు బస్తాలు ఎలా కొనుక్కున్నారో వైరల్ వీడియోల్లో చూశాం. ఇప్పుడు అటువంటి పరిస్థితే ఆస్ట్రేలియాలో కూడా కనిపిస్తోంది. భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే బాస్మతీయేతర బియ్యం ఎగుమతులను నిషేధిత జాబితాలో చేర్చింది ప్రభుత్వం. దీంతో అమెరికా వంటి దేశాల్లో బియ్యం కోసం జనాలు ఎగబడి కొనేసుకుంటున్నారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులు ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ బియ్యం కొనే పడినలో పడ్డారు. అమెరికాలో పరిస్థితులే తాజాగా ఆస్ట్రేలియా (Australia)లో కూడా కనిపిస్తున్నాయి.

భారత్ బియ్యం ఎగుమతులను నిషేధించిందన్న వార్తలతో అమెరికాలోని భారతీయులు బియ్యం పెద్ద ఎత్తున నిల్వ చేసుకునేందుకు పోటీలుపడ్డారు. ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లోనూ అదే పరిస్థితి ఉండగా ఆస్ట్రేలియాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఎన్నారైలు నెలకు సరిపడా బియ్యం కొనుక్కుంటారు. కానీ భారత్ నుంచి బియ్యం ఎగుమతులు ఆగిపోతాయనే ఆందోళనతో భారతీయులు బస్తా కొద్దీ బియ్యం కొనేస్తున్నారు.

NRIs : అమెరికాలో బియ్యం కొనుగోళ్లకు ఎగబడుతున్న ఎన్నారైలు.. స్టోర్స్ ముందు నో స్టాక్ బోర్డులు

ఆస్ట్రేలియాలో గత కొన్ని రోజులుగా బియ్యం కొనుగోళ్లు బాగా పెరిగాయని సర్రే హిల్స్ లో నివసిస్తున్న ఎంజీఎం స్పైసెస్ అనే కిరాణా స్టోర్ మేనేజర్ శిశిర్ శర్మ తెలిపారు. దీంతో డిమాండ్ కు తగినంత నిల్వలు మావద్ద లేవని అదే విషయాన్ని చెబుతున్నా ఎవ్వరు వినటంలేదని దీంతో తాము తప్పని పరిస్థితుల్లో ఒక వ్యక్తికి 5 కిలోల బియ్యం మాత్రమే అమ్ముతున్నామని తెలిపారు. దీంతో భారతీయులు స్టోర్స్ యజమానులతో వాగ్వాదానికి దిగుతున్నారని కానీ వేరే దారిలేక వారి డిమాండ్ చేసినంత స్టాక్ ఇవ్వలేక ఒకరికి 5 కిలోలకు మించి అమ్మడంలేదని తెలిపారు.

10 Years Girl 50 Countries Visit : రోజు స్కూల్‌కు వెళ్తునే 50 దేశాల్లో పర్యటించిన 10ఏళ్ల చిన్నారి .. అదెలాగబ్బా..?!

ట్రెండింగ్ వార్తలు