Commonwealth Secretary General: భారత్‌ చేస్తోన్న సాయంపై కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ ప్రశంసల జల్లు

తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్ అందిస్తోన్న సాయంపై కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ ప్యాట్రిసియా స్కాట్లాండ్ ప్రశంసలు కురిపించారు. శ్రీలంకకు ధైర్యాన్ని ఇచ్చేలా ఆ దేశానికి ఉదారభావంతో భారత్ ఎన్నో రకాలుగా సాయం చేస్తోందని ఆయన అన్నారు. కామన్వెల్త్ స్ఫూర్తిని, విలువను ఇది తెలియజేస్తుందని తెలిపారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కామన్వెల్త్ దేశాలు ఒకే కుటుంబంలా కలిసి ఉంటున్నాయని, అవసరమైన సమయంలో సాయం చేసుకుంటున్నాయని అన్నారు.

Commonwealth Secretary General: తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్ అందిస్తోన్న సాయంపై కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ ప్యాట్రిసియా స్కాట్లాండ్ ప్రశంసలు కురిపించారు. శ్రీలంకకు ధైర్యాన్ని ఇచ్చేలా ఆ దేశానికి ఉదారభావంతో భారత్ ఎన్నో రకాలుగా సాయం చేస్తోందని ఆయన అన్నారు. కామన్వెల్త్ స్ఫూర్తిని, విలువను ఇది తెలియజేస్తుందని తెలిపారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కామన్వెల్త్ దేశాలు ఒకే కుటుంబంలా కలిసి ఉంటున్నాయని, అవసరమైన సమయంలో సాయం చేసుకుంటున్నాయని అన్నారు.

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు సాయాన్ని కొనసాగిస్తామని ప్రధాని మోదీ కూడా అన్నారని ఆమె గుర్తు చేశారు. ప్రపంచ ఆహార సంక్షోభంపై పోరాడడంలో భారత్ ముఖ్య పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఆహార భద్రత విషయంలో కామన్వెల్త్ కృషి చేస్తోందని చెప్పారు. కరోనా సంక్షోభాన్ని తగ్గించేందుకు భారత్ పనిచేసిన తీరు అద్భుతమని ఆమె అన్నారు.

కొవిడ్ సమయంలో కామన్వెల్త్ దేశాలకు భారత్ చేసిన సాయానికి కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపారు. శ్రీలంకకు ప్రపంచ దేశాలు మరింత సాయం అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కామన్వెల్త్ లోని 56 దేశాల్లో భారత్, శ్రీలంక కూడా ఉన్నాయి. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వేళ ఆ దేశానికి ఈ ఏడాది భారత్ 3 వేల కోట్ల రూపాయల సాయం చేసింది.

China-Taiwan Conflict: యుద్ధ సన్నాహాల వేళ భారత్ సహా పలు దేశాలకు కృతజ్ఞతలు తెలిపిన తైవాన్

ట్రెండింగ్ వార్తలు