China-Taiwan Conflict: యుద్ధ సన్నాహాల వేళ భారత్ సహా పలు దేశాలకు కృతజ్ఞతలు తెలిపిన తైవాన్

 దేశాన్ని రక్షించుకోవడం కోసం సామర్థ్యాలను పెంచుకుంటామని తైవాన్ తెలిపింది. చైనాతో ఉద్రిక్తతలు పెరిగిన వేళ తమకు మద్దతు తెలుపుతున్నందుకు భారత్ సహా పలు దేశాలకు కృతజ్ఞతలు తెలిపింది. భావసారూప్యత కలిగిన దేశాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పింది. తైవాన్ జలసంధి భద్రత కోసం ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపింది. ప్రపంచ దేశాలలో సత్సంబంధాలు కొనసాగిస్తామని పేర్కొంది.

China-Taiwan Conflict: యుద్ధ సన్నాహాల వేళ భారత్ సహా పలు దేశాలకు కృతజ్ఞతలు తెలిపిన తైవాన్

China-Taiwan conflict

China-Taiwan Conflict: దేశాన్ని రక్షించుకోవడం కోసం సామర్థ్యాలను పెంచుకుంటామని తైవాన్ తెలిపింది. చైనాతో ఉద్రిక్తతలు పెరిగిన వేళ తమకు మద్దతు తెలుపుతున్నందుకు భారత్ సహా పలు దేశాలకు కృతజ్ఞతలు తెలిపింది. భావసారూప్యత కలిగిన దేశాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పింది. తైవాన్ జలసంధి భద్రత కోసం ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపింది. ప్రపంచ దేశాలలో సత్సంబంధాలు కొనసాగిస్తామని పేర్కొంది.

చైనా ఉద్దేశపూర్వకంగా పాల్పడుతోన్న చర్యలు శాంతి, స్థిరత్వాన్ని నాశనం చేసేలా ఉన్నాయని చెప్పింది. శాంతి, స్థిరత్వం కొనసాగడానికి తమకు మద్దతు తెలుపుతోన్న భారత్ సహా 50 దేశాలను కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, చైనా-తైవాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయంపై భారత్ తాజాగా స్పందిస్తూ తైవాన్ జలసంధి విషయంలో ఉన్న యథాపూర్వస్థితిని మార్చేలా చర్యలకు పాల్పడవద్దని చెప్పిన విషయం తెలిసిందే. శాంతి, స్థిరత్వం కొనసాగేలా కృషి చేయాలని భారత్ కోరింది.

చైనా-తైవాన్ మధ్య నెలకొన్న ప్రతికూల పరిస్థితులపై ఇతర దేశాలలాగే భారత్ కూడా ఆందోళన చెందుతోందని చెప్పింది. చైనా సైనిక విన్యాసాలు చేపట్టడంతో అందుకు దీటుగా తైవాన్ కూడా యుద్ధ సన్నాహాలు చేసుకుంటుండడంతో ఉద్రిక్త పరిస్థితులు పెరిగాయి. తైవాన్ ఇటీవల రెండు సార్లు పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేపట్టింది. తైవాన్ లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ పర్యటించిన అనంతరం చైనా సైనిక విన్యాసాలు చేపట్టిన విషయంపై అమెరికా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము చేపట్టిన సైనిక విన్యాసాలు ముగిసినప్పటికీ యుద్ధ సన్నాహాలు కొనసాగుతాయని చైనా ప్రకటించింది. చైనా దాడి చేస్తే తిప్పికొట్టడానికి తైవాన్ అన్ని చర్యలు తీసుకుంటోంది.

Dalit boy beaten to death: నీరు తాగడానికి కుండను ముట్టుకున్న దళిత బాలుడు.. కొట్టి చంపిన టీచర్