Dalit boy beaten to death: నీరు తాగడానికి కుండను ముట్టుకున్న దళిత బాలుడు.. కొట్టి చంపిన టీచర్

కుండ‌లో ఉన్న నీరు తాగడానికి దాన్ని ముట్టుకున్నాడు ఓ దళిత విద్యార్థి. అయితే, ఆ కుండలోని నీరు అగ్ర వర్ణాల పిల్లలు మాత్రమే తాగాలని, దాన్ని ఎందుకు ముట్టుకున్నావంటూ దళిత విద్యార్థిని చావగొట్టాడు ఓ టీచర్. దీంతో ఆ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లోని జాలోర్ జిల్లా సురానా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Dalit boy beaten to death: నీరు తాగడానికి కుండను ముట్టుకున్న దళిత బాలుడు.. కొట్టి చంపిన టీచర్

Dalit boy beaten to death

Dalit boy beaten to death: కుండ‌లో ఉన్న నీరు తాగడానికి దాన్ని ముట్టుకున్నాడు ఓ దళిత విద్యార్థి. అయితే, ఆ కుండలోని నీరు అగ్ర వర్ణాల పిల్లలు మాత్రమే తాగాలని, దాన్ని ఎందుకు ముట్టుకున్నావంటూ దళిత విద్యార్థిని చావగొట్టాడు ఓ టీచర్. దీంతో ఆ విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లోని జాలోర్ జిల్లా సురానా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సురానా గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదేళ్ళ ఓ బాలుడికి దాహం వేయడంతో కుండలోని నీళ్ళు తాగాలనుకున్నాడు. అయితే, ఆ కుండను అగ్రవర్ణ కులాల పిల్లలు తాగడానికి మాత్రమే పెట్టారట. దీంతో ఆ కుండను ఎందుకు ముట్టుకున్నావంటూ బాలుడిపై టీచర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రంగా కొట్టాడు. అనంతరం, ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఘటనపై స్పందించిన రాజస్థాన్ ప్రభుత్వం ఆ బాలుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ ఘటనను ఖండిస్తున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ట్వీట్ చేశారు. విద్యార్థిని కొట్టి చంపిన టీచర్ ను అరెస్టు చేశారని, అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Israeli Scientist Creates: స్టెమ్ సెల్స్ ఉపయోగించి పిండోత్పత్తి.. చిట్టెలుకపై ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల ప్రయోగంలో ముందడుగు