Israeli Scientist Creates: స్టెమ్ సెల్స్ ఉపయోగించి పిండోత్పత్తి.. చిట్టెలుకపై ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల ప్రయోగంలో ముందడుగు

ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టి విజయవంతమైన ఫలితాలను రాబ్టటారు. కృత్రిమ గర్భంలో మానవ పిండాల సృష్టి అనేది సాధ్యమవుతుందన్న ఆశలు పెంచే దిశగా వారు చిట్టెలుక పై చేసిన ప్రయోగం ఆశించిన ఫలితాలను ఇచ్చింది.

Israeli Scientist Creates: స్టెమ్ సెల్స్ ఉపయోగించి పిండోత్పత్తి.. చిట్టెలుకపై ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల ప్రయోగంలో ముందడుగు

Israel scientists

Israeli Scientist Creates: ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టి విజయవంతమైన ఫలితాలను రాబ్టటారు. కృత్రిమ గర్భంలో మానవ పిండాల సృష్టి అనేది సాధ్యమవుతుందన్న ఆశలు పెంచే దిశగా వారు చిట్టెలుక పై చేసిన ప్రయోగం ఆశించిన ఫలితాలను ఇచ్చింది. శుక్రకణం, అండం కలవనిదే గర్భదారణ సాధ్యపడదనేది అందరికీ తెలిసిందే. అయితే చిట్టెలుక మూలకణాల (స్టెమ్ సెల్స్)ను ఉపయోగించి తాజాగా శాస్త్రవేత్తలు పిండోత్పత్తి చేశారు.

Development of synthetic embryo models from day 1 (top left) to day 8 (bottom right).

Development of synthetic embryo models from day 1 (top left) to day 8 (bottom right).

ఇది ప్రయోగశాల బయోరియాక్టర్ (కృత్రిమ గర్భసంచి)లో ఎనిమిది రోజులు సజీవంగా ఉంది. అయితే చిట్టెలుక గర్భదారణ వ్యవధి 16రోజులు కాగా అందులో సగం రోజులు కావడం విశేషం. ప్రయోగంలో భాగంగా ఉపయోగించిన మూలకణాల్లో 0.5శాతం మాత్రమే ఎనిమిది రోజుల పిండంగా రూపుదిద్దుకున్నాయి. ఈ పిండంలో గుండె, నాడీ వ్యవస్థ కనిపించాయి. మిగిలిన కణాలు రకరకాల అవయవాలుగా, కణజాలంగా రూపొందాయి. ఈ ప్రయోగం ఏదో ఒకరోజు కృత్రిమ గర్భంలో మానవ పిండాల సృష్టికి దారితీయవచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.

Day 8 in the life of a mouse embryo_ a synthetic model (top) and a natural embryo (bottom).

Day 8 in the life of a mouse embryo_ a synthetic model (top) and a natural embryo (bottom).

ఇప్పటికైతే ఈ పిండానికి సజీవమైన చిట్టెలుకగా మారే శక్తి లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ప్రయోగశాలలో కృత్రిమ గుండె, మూత్ర పిండాలు, మెదడు తదితర అవయవాల సృష్టికీ ఇది ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఈ సాంకేతికత మున్ముందు పూర్తిగా అభివృద్ధి చెందితే ఒక వ్యక్తి చర్మకణం నుంచి అవయవాలను సృష్టించడానికి, కృత్రిమ పిండం అభివృద్ధికి వీలవుతుందని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.