Indonesia Volcano
Indonesia volcano : ఇండోనేషియాలో జావా ఐల్యాండ్ లోని మౌంట్ సెమేరు అగ్నిపర్వతం బద్దలైంది. కనీవినీ ఎరుగని రీతిలో బూడిద బయటకు ఎగజిమ్మింది. దీంతో ఆ ప్రాంతం అంతా బూడిద కమ్మేసింది. అగ్నిపర్వతం నుంచి వచ్చిన బూడిద ఆకాశాన్ని కప్పేసింది. వాల్ కనో బద్దలు కావడంతో స్థానికులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.
Android apps : స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక.. ఈ యాప్స్ యమ డేంజర్.. బ్యాంకు ఖాతాలు ఖాళీ
కొన్ని నెలల వ్యవధిలో అగ్నిపర్వతం బద్దలవ్వడం ఇది రెండోసారి. సెమేరు పర్వతం నుండి దట్టమైన బూడిద వర్షం కురుస్తోందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
అగ్నిపర్వతం బద్దలు కావడంతో 15వేల మీ (50వేల అడుగులు) వరకు బూడిద మేఘం పెరిగింది. దీంతో విమానయాన సంస్థలకు హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర మట్టానికి 3,676 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ అగ్నిపర్వతం గతంలో జనవరిలో బద్దలైంది. ఇండోనేషియాలోని దాదాపు 130 క్రియాశీల అగ్నిపర్వతాలలో మౌంట్ సెమేరు ఒకటి.
WhatsApp New Feature : పొరపాటున వాట్సాప్ స్టేటస్ పెట్టారా? క్షణాల్లో డిలీట్ చేయొచ్చు!
అగ్నిపర్వతం బద్దలై బూడిద మేఘం పెరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.