Android apps : స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక.. ఈ యాప్స్ యమ డేంజర్.. బ్యాంకు ఖాతాలు ఖాళీ

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అలర్ట్. మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉంటే వెంటనే వాటిని డిలీట్ చేయండి. ఈ మేరకు థ్రెట్‌ఫ్యాబ్రిక్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఫోన్ యూజర్లను హెచ్చరించింది.

Android apps : స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక.. ఈ యాప్స్ యమ డేంజర్.. బ్యాంకు ఖాతాలు ఖాళీ

Android Apps Copy

Android apps : ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అలర్ట్. మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉంటే వెంటనే వాటిని డిలీట్ చేయండి. ఈ మేరకు థ్రెట్‌ఫ్యాబ్రిక్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఫోన్ యూజర్లను హెచ్చరించింది.

ఫోన్‌ యూజర్స్ ప్లేస్టోర్ నుంచి యాప్‌లు డౌన్‌లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని థ్రెట్‌ఫ్యాబ్రిక్‌ సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు సూచించారు. యూజర్ల బ్యాంక్‌ ఖాతాల వివరాలు సేకరిస్తున్న యాప్‌లను సుమారు 3 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసినట్లు తెలిపారు. హ్యాకర్స్‌.. గూగుల్ ప్లేస్టోర్ సెక్యూరిటీని అతిక్రమించి ట్రోజన్‌ మాల్‌వేర్‌ను యాప్‌లలోకి ప్రవేశపెట్టినట్లు వివరించారు.

SBI : ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్, వడ్డీ రేట్లు తగ్గింపు.. అమల్లోకి కొత్త రూల్స్

ఈ యాప్స్‌లో ఎక్కువగా క్యూఆర్‌ కోడ్ రీడర్స్‌, డాక్యుమెంట్ స్కానర్స్, ఫిట్‌నెస్‌ మానిటర్స్‌, క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్‌, టూ ఫ్యాక్టర్ అథెంటికేటర్‌ వంటివి ఉన్నట్లు గుర్తించారు. అలానే ఈ కేటగిరీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసేటప్పుడు యూజర్స్‌ రివ్యూలను జాగ్రత్తగా చదవాలని నిపుణులు సూచించారు. ఈ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఆకర్షణీమయైన ప్రకటనలతో యూజర్స్‌ను ఆకట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రకటనల వెనుక మోసం గురించి తెలియని యూజర్స్ సదరు యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారని థ్రెట్‌ఫ్యాబ్రిక్‌ వెల్లడించింది.

ఈ యాప్ లు నాలుగు మాల్ వేర్ ఫ్యామిలీలకు చెందినవని నిపుణులు చెప్పారు. Anatsa, Alien, Hydra, Ermac. యూజర్ల ఆన్ లైన్ బ్యాంకింగ్ పాస్ వర్డ్స్ చోరీ చేసేందుకు ఈ యాప్స్ డిజైన్ చేసినట్టు వివరించారు. అంతేకాదు టు ఫ్యాక్టర్ అతెంటికేషన్ కోడ్స్ కూడా తస్కరిస్తాయి. అలాగే యూజర్ టైప్ చేసే వాటిని కూడా మాల్ వేర్ క్యాప్చర్ చేస్తుంది. యూజర్ ఫోన్ స్క్రీన్ షాట్స్ తీస్తుంది.

Thippatheega : ఆరోగ్య సమస్యలకు తిప్పతీగ

యూజర్ల బ్యాంకు ఖాతా వివరాలు తస్కరిస్తున్న మొత్తం 12 ప్రమాదకర యాండ్రాయిడ్ యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్ గుర్తించింది. థ్రెట్‌ఫ్యాబ్రిక్‌ సంస్థ ప్రకారం ఈ యాప్స్ ను 3లక్షల సార్లు డౌన్ లోడ్ చేశారు.

గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న ప్రమాదకర యాప్ లు..
* QR Scanner
* QR Scanner 2021
* PDF Document Scanner Free
* PDF Document Scanner
* Two Factor Authenticator
* Protection Guard
* QR CreatorScanner
* Master Scanner Live
* CryptoTracker
* Gym and Fitness Trainer