చిత్ర విచిత్రం : సబ్బును తినేస్తోంది

సబ్బు టెస్ట్ చేయాలంటే శరీరానికి రుద్దుకోవాలి.. మరి టేస్ట్ చేయాలంటే..? సబ్బును ఎవరైనా టేస్ట్ చేస్తారా అనే కదా మీ డౌట్..! ఈ ఫొటోలో ఉన్నా ఆమెను చూస్తే మీకే అర్ధమైతుంది.
సబ్బులు మనం శరీరాన్ని, పాత్రల్ని, బట్టల్ని శుభ్రపరచుకోవడానికి ఉపయోగిస్తాం కానీ ఇండోనేసియాలోని తూర్పు జావాకు చెందిన అసీఫాకు ఓ వింత అలవాటు ఉంది. సబ్బులు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి మరీ వాటికి రేటింగ్ ఇస్తుందట. రెండేళ్ల కిందట ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఏదైనా తినాలనే కోరిక పుట్టిందట. దీంతో ఆమె సబ్బులను ఇలా రుచి చూడటం ప్రారంభించిందట. రుచి చూడటమంటే ఏదో అలా నాలుక చివర అంటించుకోడం కాదు చక్కగా ఐస్‌క్రీం మాదిరిగా రుచి చూసి మరీ రేటింగ్ ఇస్తుందట. అంతేకాదు ఆ వీడియోలను తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈమెకు ఫాలోవర్లు పెరిగిపోయారు.