Olympic Bubble Robots: ఒలింపిక్ బబుల్‌లో ప్లేయర్లకు రోబోలే అన్నీ

బీజింగ్‌లో ఉన్న 22 మిలియన్ మందిని కొవిడ్-19 రిస్క్ నుంచి తప్పించేందుకు వినూత్నంగా ఆలోచించారు. ఒలింపిక్స్ ఆడేందుకు వచ్చిన వారి నుంచి ఇన్ఫెక్షన్లు చైనాలో వ్యాప్తి చెందకుండా ఉండాలని..

Olympic Bubble

Olympic Bubble Robots: బీజింగ్‌లో ఉన్న 22 మిలియన్ మందిని కొవిడ్-19 రిస్క్ నుంచి తప్పించేందుకు వినూత్నంగా ఆలోచించారు. ఒలింపిక్స్ ఆడేందుకు వచ్చిన వారి నుంచి ఇన్ఫెక్షన్లు చైనాలో వ్యాప్తి చెందకుండా ఉండాలని సిటీనే నిర్మించారు. అక్కడ ఒకరితో బయటి వ్యక్తులు మరెవ్వరికి ఇంటరాక్షన్ ఉండదు. కాకపోతే అక్కడ కావాల్సిన ఇంటర్నెట్ యాక్సెస్, మీల్స్ అన్నీ రోబోలే సర్వ్ చేస్తాయి.

రెండు నెలల కాలంలో పది వేలకు పైగా అథ్లెట్లు, వారి సపోర్టింగ్ స్టాఫ్ ఒలింపిక్, పారాలింపిక్ గేమ్స్ ఆడేందుకు బబుల్‌లోకి ఎంటర్ అవుతారు. వారంతా యాంకింగ్ జిల్లా, ఝాజ్జియాకౌ సిటీ దగ్గర్లో ఉండనున్నారు. క్లోజ్‌డ్ లూప్ సిస్టమ్ అయిన వేదికలు, హోటళ్లు, బార్లకు పరిమితమైన ట్రాన్స్ పోర్ట్ నెట్ వర్క్ తో పర్యటిస్తారు.

అదే సమయంలో చైనా సిటీ మొత్తాన్ని ఐసోలేషన్ లో ఉంచి జనాభాకు కరోనా మహమ్మారి లేకుండా కొవిడ్ జీరో పాలసీ కంటిన్యూ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఇటీవలి కాలంలో సిటీలన్నీ ఒమిక్రాన్ కారణంగా లాక్ డౌన్ లోకి వెళ్లాయి. మరోసారి అలా జరగకూడదని ఒలింపిక్ నియమాలను కఠినతరం చేశారు.

Read Also : కోవిడ్ నుండి బయటపడ్డా….న్యుమోనియాతో పోరాటం

ఆర్గనైజర్లకు కూడా మరో అవకాశం ఇవ్వకూడదని టికెటింగ్ సిస్టమ్ లోకూడా మార్పులు చేశారు. గేమ్స్ ఆడే వారి కోసం వెహికల్స్ ను నిర్దేశించిన లైన్లలో మాత్రమే తిరిగేందుకు అవకాశం కల్పించారు. స్థానికులు కూడా ఒలింపిక్ ఈవెంట్ కు దూరంగా ఉండాలని సూచించారు.