×
Ad

Iran Attacks: రెచ్చిపోతున్న ఇరాన్.. మరో దేశంపై దాడి.. ఎయిర్‌పోర్ట్‌పై అటాక్, ఇద్దరికి గాయాలు

ఇరాన్ వైపు నుంచి మిస్సైళ్లు దూసుకొస్తున్నాయి. ఒక డ్రోన్ నక్చీఖాన్ విమానాశ్రయ టెర్మినల్ భవనంపై పడింది.

  • Published On : March 5, 2026 / 04:51 PM IST

Azerbaijan Airport Representative Image (Image Credit To Original Source)

  • అజర్‌బైజాన్‌పై ఇరాన్ అటాక్
  • నక్చీఖాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పై డ్రోన్లతో దాడి
  • పాక్షికంగా దెబ్బతిన్న ఎయిర్ పోర్ట్
  • ఇద్దరు పౌరులకు గాయాలు

 

Iran Attacks: ఇరాన్ తగ్గేదేలే అంటోంది. ప్రతీకార దాడులను కంటిన్యూ చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా మిత్ర దేశాలను టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే పలు గల్ఫ్ దేశాలపై అటాక్స్ చేసిన ఇరాన్.. తాజాగా మరో దేశంపై దాడికి దిగింది. అజర్ బైజాన్ పై ఇరాన్ అటాక్ చేసింది. నక్చీఖాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పై డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఎయిర్ పోర్ట్ పాక్షికంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరికి గాయాలయ్యాయి. ఇరాన్ దాడిని అజర్ బైజాన్ విదేశాంగ శాఖ ఖండించింది.

అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ప్రతీకార దాడులు కంటిన్యూ చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైళ్లతో వరుస అటాక్స్ చేస్తోంది. తాజాగా అజర్ బైజాన్ పై విరుచుకుపడింది. నక్సీఖాన్ ఎయిర్ పోర్ట్ ఇరాన్ సరిహద్దులో ఉంది.

”ఇరాన్ వైపు నుంచి మిస్సైళ్లు దూసుకొస్తున్నాయి. ఒక డ్రోన్ నక్చీఖాన్ విమానాశ్రయ టెర్మినల్ భవనంపై పడింది. మరొక డ్రోన్ షెకెరాబాద్ గ్రామంలోని ఒక స్కూల్ భవనం సమీపంలో పడిపోయింది” అని అజర్ బైజాన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. డ్రోన్ దాడిలో విమానాశ్రయం దెబ్బతిందని, ఇద్దరు పౌరులు గాయపడ్డారని వెల్లడించింది.

Also Read: పంజాబ్ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ షాక్.. ఈ ATM కార్డులపై క్యాష్ విత్‌డ్రా లిమిట్ 50% కట్! మీ కార్డ్ ఇదేనా?