Iran-US War: శాంతి ఒప్పందాన్ని పక్కన పెట్టేసిన ఇరాన్.. క్షిపణులతో భారీ దాడులు.. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత

అంతర్జాతీయ వేదికపై అమెరికా, ఇరాన్(Iran-US War) దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరాయి.

Iran launches fierce attack, casting aside the peace agreement.

  • అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.
  • శాంతి ఒప్పందాన్ని రద్దు చేసిన ఇరాన్.
  • సైనిక స్థావరాలపై పరస్పర క్షిపణి దాడులు.

Iran-US War: అంతర్జాతీయ వేదికపై అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరాయి. గత నెలలోనే ఇరు దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని పూర్తిగా పక్కనపెట్టేస్తున్నట్లు ఇరాన్ తాజాగా ప్రకటించింది. ఈ ఒప్పందంలోని నిబంధనలకు ఇకపై తాము కట్టుబడి ఉండబోమని స్పష్టం చేసింది. అయితే శాంతి ఒప్పందాన్ని మొదట ఉల్లంఘించింది అమెరికాయేనని ఇరాన్ తీవ్రంగా ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.

Ahmedabad Tragedy: బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 8 మంది మృతి

హోర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులు:

ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Iran-US War) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇరాన్‌తో చాప్టర్ ముగిసిందని, వారితో వ్యవహరించడం సమయం వృథా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ, హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణం, అణు కార్యక్రమంపై చర్చలే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. అయితే ఇటీవల హోర్ముజ్ ప్రాంతంలో మూడు కమర్షియల్ నౌకలపై జరిగిన దాడులే ఈ ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. ఇరానే ఈ దాడులకు పాల్పడి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అమెరికా ఆరోపిస్తోంది.

పరస్పర దాడులతో దద్దరిల్లుతున్న గల్ఫ్ ప్రాంతం:

ఈ వివాదం కాస్తా ప్రస్తుతం సైనిక దాడుల రూపంలోకి మారింది. గత వారం రోజులుగా అమెరికా, ఇరాన్ ఆర్మీలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా సైన్యం రాత్రి సమయాల్లో ఇరాన్‌లోని పలు వ్యూహాత్మక ప్రాంతాలను టార్గెట్ చేయగా, దీనికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్ రీజియన్‌లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. పలు యూఎస్ ఫైటర్ జెట్లను కూడా ధ్వంసం చేశామని ఇరాన్ ప్రకటించడంతో పశ్చిమాసియాలో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.