Salman and Ronaldo: సల్మాన్ ఖాన్‭ను రొనాల్డో నిజంగానే పట్టించుకోలేదా? ఆసక్తికర నిజం బయటికి వచ్చింది

సౌదీ అరేబియాలో టైసన్ ఫ్యూరీ, ఫ్రాన్సిస్ నాగన్‌నౌ మధ్య జరిగిన MMA మ్యాచ్ కి ఈ ఇద్దరు స్టార్‌లు హాజరయ్యారు. అదే సమయంలో తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోను ఉటంకిస్తూ, సల్మాన్‌ను రొనాల్డో పట్టించుకోకుండా వెళ్లిపోయాడని ట్రోల్ చేస్తున్నారు

Salman and Ronaldo: సోమవారం నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో సంచలనం సృష్టించింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో, బాలీవుడ్ టైగర్ అంటే సల్మాన్ ఖాన్‌ను ఫుట్‭బాల్ స్టార్ ప్లేయర్ రొనాల్డో విస్మరించాడు. నిజానికి ఆ వీడియోలో అలాగే కనిపిస్తోంది. ఈ వీడియోను నెటిజెన్లు పెద్ద ఎత్తున షేర్ చేస్తూ.. తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇది అబద్ధమని తెలుస్తోంది. మీరు చదివింది నిజమే. సల్మాన్ ఖాన్‌ను రొనాల్డో పట్టించుకోలేదన్న వాదన అబద్ధమని నిరూపితమైంది. నిజానికి ఇద్దరు లెజెండ్స్ ఎదురైనప్పుడు ఏ జరిగిందో తెలుసుకుందాం..


నిజానికి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్ అవుతున్న సౌదీ అరేబియాలో టైసన్ ఫ్యూరీ, ఫ్రాన్సిస్ నాగన్‌నౌ మధ్య జరిగిన MMA మ్యాచ్ కి ఈ ఇద్దరు స్టార్‌లు హాజరయ్యారు. అదే సమయంలో తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోను ఉటంకిస్తూ, సల్మాన్‌ను రొనాల్డో పట్టించుకోకుండా వెళ్లిపోయాడని ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఆ సమయంలో ఇద్దరు కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. నెటిజెన్లు ట్రోల్ చేస్తున్న వైరల్ వీడియో అబద్ధం.


తాజాగా ఒక కొన్ని ఫొటోలు, వీడియోలు బయటకు వస్తున్నాయి. ఇందులో ఇద్దరి మధ్య చాలా సంభాషణలు జరిగినట్లు చూడొచ్చు. ఈ ఫోటోల్లో ఇద్దరు స్టార్లు ఒకరితో ఒకరు చాలా మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా సల్మాన్ చెప్పిన మాటలకు రొనాల్డో కూడా నవ్వుకుంటున్నాడు. ఇప్పుడు ఈ ఫోటో సల్మాన్ ఖాన్‌ను రొనాల్డో పట్టించుకోలేదన్న వాదనను తప్పుగా నిరూపించింది.