Italy: ఇటలీలో పిల్లలు ఎందుకు పుట్టడం లేదు? మూడు నెలల్లో ఒక్క డెలివరీ కూడా కాలేదు

ఇటలీలో సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే.. అక్కడి ప్రధాని జార్జియా మెలోనీ దానిని జాతీయ ఎమర్జెన్సీగా భావిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది కూడా ఆమె ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని చాలా గట్టిగానే ప్రస్తావించారు.

Italy: ప్రపంచం వేగంగా వృద్ధాప్యం వైపు పయనిస్తోంది. చైనా, జపాన్ లాంటి దేశాలే ఇందుకు పెద్ద ఉదాహరణ. ఇప్పుడు ఇటలీ కూడా ఈ జాబితాలో చేరవచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి పెద్ద కారణం అక్కడ పిల్లలు పుట్టకపోవడమే. నివేదికల ప్రకారం.. గత మూడు నెలలుగా ఇటలీలో ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు. నిజానికి ఇది చాలా పెద్ద సమస్య. అందుకే ఆ దేశ ప్రధానమంత్రి జార్జ్ మెలోని దీనిని జాతీయ అత్యవసర పరిస్థితిగా చూస్తున్నారు.

నివేదిక ఏం చెప్తోంది?
ఒక ఇంగ్లీష్ న్యూస్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. ఇటలీ ఇటీవల కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. అయితే ఈ ప్రపంచ రికార్డు సంతోషించాల్సిన విషయమేమీ కాదు. ఎందుకంటే ఇటలీ శరవేగంగా వృద్ధాప్యం వైపు పయనిస్తోంది. గత మూడు నెలల్లో ఇటలీలో ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు. దీనిపై రాయిటర్స్ ఇలా రాసింది.. ‘‘నేషనల్ స్టాటిస్టిక్స్ బ్యూరో ISTAT గణాంకాల ప్రకారం, ఇటలీలో జనవరి 2023 నుంచి జూన్ 2023 వరకు జన్మించిన పిల్లల సంఖ్య జనవరి 2022 నుంచి జూన్ 2022 మధ్య జన్మించిన వారి కంటే 3500 తక్కువ’’ అని పేర్కొంది.

జాతీయ అత్యవసర పరిస్థితి భావించిన ప్రధాని
ఇటలీలో సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే.. అక్కడి ప్రధాని జార్జియా మెలోనీ దానిని జాతీయ ఎమర్జెన్సీగా భావిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది కూడా ఆమె ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని చాలా గట్టిగానే ప్రస్తావించారు. గత సంవత్సరం పుట్టిన ప్రతి ఏడుగురు పిల్లలకు 12 మరణాలు నమోదయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. కాస్త అర్థమయ్యేలా చెప్పాలంటే.. అక్కడ రోజుకు ఏడుగురు పిల్లలు పుడుతుంటే, ఒకే రోజు 12 మంది చనిపోతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే అక్కడి జనాభా వేగంగా తగ్గిపోతుందనది వేరే చెప్పనక్కర్లేదు.