Israel Palestine Conflict: గాజా రెండు ముక్కలైందంటూ సంచలన ప్రకటన చేసిన ఇజ్రాయెల్Gaza Cut Into 2: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం నెల రోజులుగా సాగుతోంది. ఇరు ప్రాంతాల్లో భీకర యుద్ధ వాతావరణం ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. ఇంతలో ఒక పెద్ద వార్తను ఇజ్రాయెట్ ఆర్మీ బయటపెట్టింది. గాజాను రెండు ముక్కలు చేశామని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి డేనియల్ హెన్రీ ప్రకటించారు. అంటే ప్రస్తుతం ఉన్న గాజా పట్టీని ఉత్తర గాజా, దక్షిణ గాజాగా విడగొట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇక ఈ ప్రకటన వెలువడిన అనంతరం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహూ మరో ఆసక్తికర ప్రకటన చేశారు. హమాస్ పూర్తిగా నాశనం అయ్యే వరకు యుద్ధం ఆపకూడదని చెప్పారు. ‘‘హమాస్ ను పూర్తిగా అంతమొందిస్తాం. ఈ విషయం మా శత్రువులకు మిత్రులకు కలిపి చెప్తున్నాను. మేము గెలిచే వరకు యుద్ధం కొనసాగుతుంది. యుద్ధం తప్ప మరో అవకాశం మాకు లేదు’’ అని బెంజమిన్ నెతన్యాహు అన్నారు.
ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటివరకు 9770 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసి కనీసం 1400 మందికి చావుకు కారణమైంది. ఆ తర్వాత గాజా మీద ఇజ్రాయెల్ ప్రతిదాడులు ప్రారంభించింది. ఇది కాకుండా 340 మందిని బందీలుగా పట్టుకున్నారు. కాగా గాజాలో మరోసారి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి అక్కడ ఇంటర్నెట్ నిలిపివేయడం ఇది మూడోసారి.