Iran vs Israel War : ఇరాన్‌తో యుద్ధంపై.. డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన.. నేనూ పాకిస్థాన్ వెళ్తా..

Iran vs Israel War : ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు పక్షాల సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయని అన్నారు.

Donald Trump

  • పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్‌ సంచలన ప్రకటన
  • శాంతి చర్చల్లో కీలక పురోగతి దిశగా అడుగులు
  • శుద్ధిచేసిన యురేనియం నిల్వలను అప్పగించేందుకు ఇరాన్ ఒప్పుకుంది

Iran vs Israel War : ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం వైట్‌హౌజ్ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శాంతి చర్చల్లో కీలక పురోగతి దిశగా అడుగులు పడుతున్నాయని, ఇరు పక్షాల సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో శుద్ది చేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ చెప్పారు.

Also Read : Weather Update : డేంజర్ బెల్స్.. బయటకు రాకండి.. రాబోయే రెండు నెలలు జాగ్రత్త..! సంచలన నివేదిక .. బాబోయ్ మంటలే..

శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉన్నాం.. ఒప్పందం కుదిరితే పాకిస్థాన్‌కు వెళ్లి సంతకాల ప్రక్రియలో నేనూ భాగమయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు. ఇదిలాఉంటే.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తో రెండు నెలలే యుద్ధం చేశామని, అమెరికా చేసిన ఇతర యుద్ధాలు 18ఏళ్లు, నాలుగేళ్లు కొనసాగాయని తెలిపారు. తాజా యుద్ధంలో తాము త్వరలోనే విజయం సాధించినట్లు ఆయన వెల్లడించారు. ఇరాన్ పై సైనిక చర్యకు దిగకపోయి ఉంటే చెడు పరిణామాలు చోటుచేసుకొనేవని ట్రంప్ చెప్పుకొచ్చారు.

మరోవైపు.. లెబనార్ – ఇజ్రాయెల్ మధ్య 10రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ట్రంప్ స్వయంగా ఈ కాల్పుల విరమణను ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా తాను ఇప్పటి వరకు తొమ్మిది యుద్ధాలు ఆపానని, ఇప్పుడు తాజాగా పదో యుద్ధాన్ని ఆపానని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా ఆయన అభివర్ణించారు.

ఇదిలాఉంటే.. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలకు అడుగులు పడ్డాయి. ఇస్లామాబాద్ లో ఈనెల 11న జరిగిన తొలి దఫా చర్చలకు ముందు యురేనియం శుద్ధి పూర్తిగా ఆపే ఉద్దేశం లేదని ఇరాన్ స్పష్టంగా పేర్కొంది. ఈ తరుణంలో ట్రంప్ చేసిన తాజా ప్రకటనపై ఎలా స్పందిస్తుందో చూడాలి.