Israel Palestine Conflict: ఆ మాటని చిక్కుల్లో పడ్డ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహూ

శనివారం సాయంత్రం జరిగిన వార్తా సమావేశంలో, హమాస్ దాడులను ఆపడంలో వైఫల్యానికి బాధ్యత వహిస్తారా అని జర్నలిస్టులు నెతన్యాహును పదేపదే ప్రశ్నించారు. యుద్ధం ముగిసిన తర్వాత సమగ్ర విచారణ జరుగుతుందని, తనతో సహా అందరూ సమాధానం చెప్పాల్సి ఉంటుందని ప్రశ్నను తప్పించారు.

Benjamin Netanyahu: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం 23వ రోజుకు చేరుకుంది. ఇంతలో, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రకటన చేసి ప్రతిపక్షాలే కాకుండా మిత్రపక్షాల నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అనంతరం తన మాటల్ని సవరించుకుని తప్పు చేశానంటూ క్షమాపణలు చెప్పారు. అక్టోబరు 7న హమాస్ జరిపిన ఘోరమైన దాడిని ఆపడంలో దేశ భద్రతా సేవలు విఫలమయ్యాయని నెతన్యాహు ఆరోపించారు. అయితే, ఆదివారం ఆయన తన ప్రకటనపై క్షమాపణలు చెప్పారు.

నెతన్యాహు ఆ ఒరిజినల్ స్టేట్‌మెంట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ నుంచి తొలగించిన అనంతరం.. కొత్త పోస్ట్‌లో “నేను తప్పు చేసాను” అని రాసుకొచ్చారు. విలేకరుల సమావేశం తర్వాత తాను మాట్లాడిన విషయాలు చెప్పకూడదని, అందుకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. భద్రతా సేవలకు తాను పూర్తి మద్దతు ఇస్తానని, తాను (IDF) చీఫ్ ఆఫ్ స్టాఫ్, కమాండర్లు, సైనికులకు మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వారు ముందు వరుసలో ఉండి తమ ఇళ్లను రక్షించడానికి పోరాడుతున్నారని అన్నారు.

అంతకు ముందు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి ఏం చెప్పారు?
హమాస్ యుద్ధ ఉద్దేశాల గురించి తనకు ఏ స్థాయిలోనూ హెచ్చరికలు అందలేదని ఇజ్రాయెల్ ప్రధాని శనివారం అర్థరాత్రి ఎక్స్ ఖాతాలో (ట్విట్టర్‌) పోస్ట్ చేశారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్, షిన్ బెట్ (దేశీయ గూఢచార సంస్థ) అధిపతితో సహా అన్ని భద్రతా సేవలు హమాస్ తప్పుకుంటున్నాయని, ఒక ఒప్పందానికి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అంనతరం ఆ పోస్టును తొలగించారు.

యుద్ధం తర్వాత సమగ్ర విచారణ ఉంటుంది, నాతో సహా అందరూ సమాధానం ఇస్తారు
శనివారం సాయంత్రం జరిగిన వార్తా సమావేశంలో, హమాస్ దాడులను ఆపడంలో వైఫల్యానికి బాధ్యత వహిస్తారా అని జర్నలిస్టులు నెతన్యాహును పదేపదే ప్రశ్నించారు. యుద్ధం ముగిసిన తర్వాత సమగ్ర విచారణ జరుగుతుందని, తనతో సహా అందరూ సమాధానం చెప్పాల్సి ఉంటుందని ప్రశ్నను తప్పించారు. చాలా మంది భద్రతా చీఫ్‌లు ఈ పెద్ద వైఫల్యానికి బాధ్యత వహించారు. అయితే నెతన్యాహు దీనికి ఎటువంటి బాధ్యత వహించకుండా తప్పించుకున్నారు. నెతన్యాహు 2009 నుంచి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. మధ్యలో 13 నెలల పాటు పదవిలో లేరు.