israel : తెగిన తలను అతికి అరుదైన శస్త్ర చికిత్స చేసిన వైద్యులు .. వైద్య రంగంలో మిరాకిల్.
ఇజ్రాయిల్ వైద్యులు అద్భుతం సృష్టించారు. ప్రమాదంలో దాదాపుగా తెగిపోయిన బాలుడి తలను అరుదైన శస్త్ర చికిత్స ద్వారా అతికించారు. వైద్య రంగంలో ఇదో అరుదైన ఘటనగా చెప్పాలి.
- Lakshmi 10tv
- Published On : July 14, 2023 / 04:31 PM IST
israel
israel : ఇజ్రాయిల్ వైద్యులు అద్భుతం చేశారు. యాక్సిడెంట్‌లో తెగిపోయిన తలను మెడకి తిరిగి అతికి శస్త్ర చికిత్స చేయడం ద్వారా వైద్యరంగంలోనే చరిత్ర సృష్టించారు.
Rose Flower Cultivation : ఇజ్రాయిల్ టెక్నాలజీతో గులాబిపూల సాగు.. ఏడాది పొడవునా దిగుబడులు
సులేమాన్ హసన్ అనే 12 ఏళ్ల బాలుడుకి ఇజ్రాయిల్ వైద్యులు అసాధారణమైన శస్త్ర చికిత్స చేశారు. సైకిల్‌పై వెళ్తుండగా అతనిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అతని పుర్రె.. వెన్నెపూస నుంచి విడిపోయింది. ఇలాంటి పరిస్థితిని ‘అట్లాంటో ఆక్సిపిటల్ జాయింట్ డిస్ లొకేషన్’ అంటారట. ప్రమాదం జరిగిన వెంటనే బాలుడిని హడాస్సా మెడికల్ సెంటర్‌కు విమానంలో తరలించారు. అక్కడి నుంచి అత్యవసర శస్త్ర చికిత్సల కోసం పంపారు. వైద్యుల ప్రకారం అతని మెడ నుంచి దాదాపుగా తల పూర్తిగా వేరు చేయబడింది. అలాంటి పరిస్థితుల్లో వైద్యులు చేసిన అరుదైన శస్త్ర చికిత్సతో అతను బతికి బయట పడ్డాడు. రీసెంట్‌గా మిస్టర్ హసన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.. కానీ అతను పూర్తిగా కోలుకునేంత వరకూ మానిటర్ చేస్తూనే ఉంటామని వైద్యులు పేర్కొన్నారు.
Israel : ఇజ్రాయిల్ దళాల దాడులు.. ముగ్గురు ఇస్లామిక్ జిహాదీ కమాండర్లు హతం
ఇది సాధారణ శస్త్ర చికిత్స కాదని .. పిల్లల విషయంలో కాబట్టి వైద్యులు ఎంతో జాగ్రత్తగా తమ అనుభవంతో చేశారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. తమ ఒక్కగానొక్క కొడుకుని కాపాడినందుకు బాలుడి తల్లిదండ్రులు వైద్యులకు కృతజ్ఞతలు చెప్పారు.
