Israel : ఇజ్రాయిల్ దళాల దాడులు.. ముగ్గురు ఇస్లామిక్ జిహాదీ కమాండర్లు హతం

Israel : ఇజ్రాయిల్ దళాల దాడులు.. ముగ్గురు ఇస్లామిక్ జిహాదీ కమాండర్లు హతం

Israel

Israel  : ఇజ్రాయిల్ దళాల దాడిలో ముగ్గురు ఇస్లామిక్ జిహాదీ కమాండర్లు హతమయ్యారు. మంగళవారం ఉదయం ఇజ్రాయిల్ దళాలు గాజాలో దాడి చేశాయి. ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ పై జరిగిన దాడిలో ముగ్గురు కమాండర్లు మృతి చెందారు. ఈ దాడిలో 12 మంది పాలస్తీనియన్లు కూడా మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, మగ్గురు చిన్నారులు ఉన్నారు.

ఈ దాడిలో మరో 20 మందికి గాయలయ్యాయి. మిలిటెంట్లు లక్ష్యంగా భారీ ఆపరేషన్ చేపట్టినట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. కాగా, ఇస్లామిక్ జిహాదీలు ప్రతీకార దాడులు చేయనున్నట్లు వెల్లడించారు. ఇజ్రాయిల్ పై రాకెట్లతో దాడులు చేస్తామని ఇస్తామిక్ జిహాదీలు హెచ్చరించినట్లు సమాచారం.

Terrorist Killed : జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఉగ్రవాది హతం

ఇజ్రాయిల్ కు చెందిన 40 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు గాజాలో దాడి చేశాయి.  ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొన్ని చోట్ల అపార్ట్ మెంట్లు ధ్వంసమయ్యాయి. ముగ్గురు మిలిటెంట్లను టార్గెట్ చేసేందుకు తమ విమానాలు 10 కేంద్రాలను పేల్చినట్లు ఇజ్రాయిల్ పేర్కొంది.

6 ఇస్తామిక్ జిహాదీ కేంద్రాలను కూడా ధ్వంసం చేసినట్లు తెలిపింది. తమ దళానికి చెందిన ముగ్గురు కమాండర్లు మృతి చెందారని ఇస్లామిక్ జిహాదీ మిలిటరీ వింగ్ అల్ ఖుద్స్ బ్రిగేడ్స్ తెలిపింది. మృతుల్లో జిహాద్ షాకేర్ అల్ ఘన్నామ్, కమాండర్ ఖలిల్ సలాహ్ అల్ భతిని మిలిటెంట్ లీడర్ తారిక్ మొహమ్మద్ ఇంజనీర్ ఉన్నారు.