బీజింగ్ : ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ వరల్డ్ కప్ లో భారత్ కు స్వర్ణం దక్కింది. భారత్ కు చెందిన షూటర్ అభిషేక్ వర్మ గోల్డ్ సాధించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో ఈ ఘనత సాధించాడు. ఈ పతకంతో అభిషేక్ టోక్యో ఒలింపిక్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు.
242.7 స్కోర్ తో వర్మ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. 29ఏళ్ల వర్మకు ఇది రెండో ISSF వరల్డ్ కప్. రష్యన్ కు రజతం, కొరియన్ కు కాంస్యం దక్కాయి. అభిషేక్ వర్మ ఆసియన్ గేమ్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఆ టోర్నీలో కాంస్యం దక్కించుకున్నాడు.