Masks: మాస్క్‌లు లేకుండా తిరగొచ్చు.. జూన్ 28 తర్వాత తప్పనిసరి కాదు!

కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డ దేశాల్లో ఇటలీ కూడా ఒకటి. ఈ దేశంలో కోట్లలో కేసులు.. లక్షల్లో మరణాలు నమోదయ్యాయి. ఎట్టకేలకు మహమ్మారి బారి నుంచి ఇటలీ దేశం బయటపడుతోంది. ఈ క్రమంలో మాస్క్ పెట్టుకోవల్సిన అవసం కూడా లేకుండా నిబంధనలు మారుస్తుంది ఆ దేశం.

Italy Says Face Masks Will No Longer Be Mandatory From June 28

Italy: కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డ దేశాల్లో ఇటలీ కూడా ఒకటి. ఈ దేశంలో కోట్లలో కేసులు.. లక్షల్లో మరణాలు నమోదయ్యాయి. ఎట్టకేలకు మహమ్మారి బారి నుంచి ఇటలీ దేశం బయటపడుతోంది. ఈ క్రమంలో మాస్క్ పెట్టుకోవల్సిన అవసం కూడా లేకుండా నిబంధనలు మారుస్తుంది ఆ దేశం.. ఇప్పుడు ఆ దేశంలో కేవలం 800కేసులు మాత్రమే నమోదవుతూ ఉండగా.. మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నట్లుగా ప్రకటించింది.

ఈ క్రమంలోనే జూన్ 28వ తేదీ తర్వాత మాస్క్ వేసుకోవల్సిన అవసరం కూడా లేదంటూ కీలక ప్రకటన చేసింది ఇటలీ. ఇటలీలో మహమ్మారి కోవిడ్ -19 వ్యాప్తి తగ్గిందని, జూన్ చివరి వారం నుంచి ముసుగు ధరించడం తప్పనిసరి కాదని దేశంలో ప్రకటించింది ప్రభుత్వం. అయితే, ఇక్కడ ఇంకా కూడా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా పరీక్షతో పాటు.. 5 రోజులు క్వారంటైన్‌ను మాత్రం తప్పనిసరి చేసింది.

కరోనా వైరస్ కేసులు పెరిగితే మాత్రం ఆందోళన అవసరం ఉందని, దేశ ఆరోగ్య మంత్రి రాబర్టో స్పెరాన్జా గతవారం స్పష్టంచేశారు. దీనితో పాటు అమెరికా, కెనడా, జపాన్, యూరప్ నుంచి వచ్చే ప్రయాణికులు గ్రీన్ పాస్ చూపించాల్సి ఉంటుందని ఆదేశాలు జారీచేశారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే గ్రీన్ పాస్ ఇవ్వబడుతుంది. ఒకవేళ గ్రీన్ పాస్ లేని పక్షంలో కోవిడ్ పరీక్ష నెగెటివ్‌గా వచ్చినట్లు సర్టిఫికేట్ అయినా చూపించాలి. భారతదేశం, బంగ్లాదేశ్ మరియు శ్రీలంక నుంచి వచ్చే వ్యక్తులపై మాత్రం నిషేధం కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతుంది.