Giorgia Meloni : ఇటలీ తొలి మహిళా ప్రధానిగా జార్జియా మెలోని .. రెండో ప్రపంచ యుద్ధం తరువాత మహిళ ప్రధాని కావటం ఇదే తొలిసారి

ఇటలీ చరిత్రలో తొలిసారి ఓ మహిళా నేత ప్రధాని పదవి చేపట్టనున్నారు. పైగా ఆమె ఓ అతివాద నేత కావటం మరో విశేషం. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇటలీకి మహిళ ప్రధాని కావటం ఇదే మొదటిసారి. 45 ఏళ్ల జార్జియా మెలోని ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు.

Giorgia Meloni Won Italian Elections : ఇటలీ చరిత్రలో తొలిసారి ఓ మహిళా నేత ప్రధాని పదవి చేపట్టనున్నారు. పైగా ఆమె ఓ అతివాద నేత కావటం మరో విశేషం. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇటలీకి మహిళ ప్రధాని కావటం ఇదే మొదటిసారి. బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీకి చెందిన అతివాద నేత 45 ఏళ్ల జార్జియా మెలోని ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. 26.37శాతం ఓట్లు సాధించి విజయకేతనం ఎగురవేశారు. బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీ నేతృత్వంలోని కూటమి 43శాతానికి పైగా ఓట్లతో విజయం సాధించింది.

మెలోని పూర్తిగా అతివాద నేతకావటం మరింత ఆసక్తికరంగా మారింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన పూర్తి అతివాద ప్రభుత్వం కూడా ఇదే కావటం మరో విశేషం. వివాదాస్పదమైన ‘గాడ్‌, ఫాదర్‌ల్యాండ్‌ అండ్‌ ఫ్యామిలీ’ నినాదంతో మెలోని ప్రచారం చేయటమే కాకుండా విజయం సాధించటం కూడా విశేషంగా మారింది. మెలోని ఎల్‌జీబీటీ హక్కులకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇటలీ నౌకాదళం లిబియా సముద్ర మార్గాన్ని మూసివేయాలంటున్నారు మెలోని. అదే సమయంలో దేశంలోని ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా తరచూ హెచ్చరికలు జారీ చేశారు.

పైగా ఆమె ఇటలీ అతి పెద్ద ఆర్థఇక వ్యవస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో ఆమె ప్రధాని కావటం ఆమెకు పెను సవాళ్లు ఎదురుకానున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో విజయం సాధించి ప్రధాని కానున్న మెలోని సోమవారం (సెప్టెంబర్ 26,9,2022) రోమ్ లోని ఓ హోటల్ లో ప్రసంగిస్తూ..దేశంలోని ఆర్థిక వ్యవస్థను సరిదిద్దాల్సిన అసవరం ఎంతోఉందని మనం ఆరంభం స్థాయిలోనే ఉన్నాం.రేపటి రోజు నుంచి మనం ఏంటో నిరూపించుకోవాల్సి ఉందని అని అన్నారు.

కాగా గత ఎన్నికల్లో మెలోని పార్టీకి కేవలం 4శాతం మాత్రమే ఓట్లు లభించాయి. కానీ, మారియో డ్రాఘీ నేతృత్వంలోని కూటమిలో చేరడానికి నిరాకరించారు. దీంతో ఆమె ప్రధాన ప్రతిపక్ష నేతగా నిలిచారు. జార్జియా మెలోని గ్రాబ్టెల్లాలోని ఓ కార్మిక కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోవటంతో మెలోని తల్లి వద్దే పెరిగారు. యుక్త వయసులో ఆమె నియో ఫాసిస్టు సంస్థ యూత్‌ విభాగంలో చేరారు. కానీ నేను ఫాసిస్టుని కాదని చెబుతుంటారామె.

 

ట్రెండింగ్ వార్తలు