వారానికి 60 గంటల డ్యూటీ.. జపాన్ ఉద్యోగులంతా వీధుల్లో ఎలా నిద్రపోతున్నారో చూడండి!

జపాన్ దేశంలో సామాజికంగా వీధుల్లో నిద్రపోయేందుకు అనుమతి ఉంటుంది. అక్కడ ఎక్కువ రాత్రుళ్లూ ఓవర్ నైట్ డ్యూటీలు చేయడం సాధారణం కూడా. జపాన్ లో వారానికి 60 గంటలు పనిచేయడం సర్వసాధారణం..

Japan Corporate Workers : జపాన్ దేశంలో సామాజికంగా వీధుల్లో నిద్రపోయేందుకు అనుమతి ఉంటుంది. అక్కడ ఎక్కువ రాత్రుళ్లూ ఓవర్ నైట్ డ్యూటీలు చేయడం సాధారణం కూడా. జపాన్ లో వారానికి 60 గంటలు పనిచేయడం సర్వసాధారణం..

[Credit to HIGH FASHION]

ఈ సంస్కృతి శతాబ్దాల కాలంగా కొనసాగుతూ వస్తోంది. కానీ, రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత నుంచి ఇది మరింత ప్రాచుర్యం పొందింది. ఆ సమయంలో అప్పటి జపాన్ ప్రధాని Shigeru Yoshida అక్కడి దేశ కంపెనీలను ఎక్కువ సమయం పనిచేసేలా ప్రోత్సహించారు.

[Credit to HIGH FASHION]

దేశీయ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు పనివేళలు పెంచాలని సూచించారు. దశాబ్దాల తర్వాత అదే తరహా పనివేళ విధానాలు అమల్లోనే కొనసాగుతూ వస్తున్నాయి.

[Credit to HIGH FASHION]

ఈ రోజుల్లో అప్పటి తరహా పనివిధానంతో వేతనజీవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది.

[Credit to HIGH FASHION]

ఫలితంగా అనారోగ్య సమస్యలతో మరణానికి దగ్గరవుతున్నారు. ప్రస్తుతం జపాన్ దేశంలో అధిక గంటలు పనిచేసవారిలో గుండె సంబంధిత సమస్యలు, ఆత్మహత్యలు వంటివి ఎక్కువగా పెరుగుతున్నాయి.

[Credit to HIGH FASHION]

ఈ పరిస్థితుల దృష్ట్యా జపాన్ ప్రభుత్వాలు సైతం కంపెనీల ఉద్యోగుల్లో పని సమయానికి తగ్గించుకోవాలని సూచిస్తున్నాయి. దేశంలో కార్పొరేట్ ఉద్యోగుల్లో ఎక్కువగా అధిక పనిభారంతో విశ్రాంతి లేక ఆందోళన చెందుతున్నారు.

[Credit to HIGH FASHION]

కంటినిద్ర లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడి నిద్రపోతున్నారు. చాలా మంది ఉద్యోగులు అధిక పనివేళలతో విసిగిపోయి నిద్రసరిపోక వీధుల్లో, మెట్లపై ఎక్కడి పడితే అక్కడి నిద్రపోతున్న పరిస్థితి నెలకొంది.

[Credit to HIGH FASHION]

డ్యూటీ అనంతరం చాలా మంది ఉద్యోగులు వీధుల్లో నడుస్తూనే నిద్రపోతున్నారు. పోలాండ్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ Pawel Jaszczuk ఎన్నో ఏళ్లుగా టోక్యోలో నివసిస్తున్నాడు.

[Credit to HIGH FASHION]

అక్కడి వీధుల్లో పనిభారంతో బాగా నీరసించి పోయి వీధుల్లో నిద్రపోతున్న అనేక మంది ఉద్యోగులకు సంబంధించి ఫొటోలను సేకరించారు.

[Credit to HIGH FASHION]

2008 నుంచి 2010 మధ్య తీసిన ఈ ఉద్యోగుల ఫొటోలను 2018లో ఓ బుక్ లో ప్రచురించినట్టు చెప్పారు. ఎప్పుడైనా జపాన్ వెళ్లినప్పుడు చాలామంది కార్పొరేట్ ఉద్యోగులు ఇలా వీధుల్లో నిద్రపోవాడాన్ని చూడటం చాలా సర్వసాధారణమని అంటున్నారు.

[Credit to HIGH FASHION]

ట్రెండింగ్ వార్తలు