Covid Relief Fund: పొరబాటున వ్యక్తి అకౌంట్లో రూ. 2.77కోట్ల కొవిడ్ రిలీఫ్ ఫండ్

జపాన్‌లోని ఒక టౌన్‌కు సంబంధించిన కొవిడ్ రిలీఫ్ ఫండ్ అంతా ఓ వ్యక్తి బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ అయింది. అంతే, ఇక ఆ వ్యక్తి ఎవరికీ కనపడకుండా పరారీలో ఉన్నాడు.

 

 

Covid Relief Fund: జపాన్‌లోని ఒక టౌన్‌కు సంబంధించిన కొవిడ్ రిలీఫ్ ఫండ్ అంతా ఓ వ్యక్తి బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ అయింది. అంతే, ఇక ఆ వ్యక్తి ఎవరికీ కనపడకుండా పరారీలో ఉన్నాడు. 463ఇళ్లు ఉన్న ఆ పట్టణానికి వచ్చిన రిలీఫ్ ఫండ్ తో ఒకొక్క ఇంటికి రూ.60వేల వరకూ అందించొచ్చు.

బ్యాంక్ సిబ్బంది చేసిన పొరబాటుకు ఆ నగర మేయర్ క్షమాపణలు చెప్తున్నారు. తప్పు అర్థం చేసుకుని తిరిగి ఆ డబ్బులు తీసుకొస్తామని అంటున్నారు. కొద్ది వారాలుగా ఆ వ్యక్తి అకౌంట్లో చాలా డబ్బు డిపాజిట్ అవుతున్నట్లు తెలిసి అధికారులు అలర్ట్ అయ్యారు.

మీడియా కథనం ప్రకారం.. ఊరికే వచ్చిపడుతున్న డబ్బులను చూసి బ్యాంక్ వారికి అనుమానం రాకుండా ఉండేందుకు ఇతర అకౌంట్లకు ట్రాన్సఫర్ చేస్తుండేవాడు. రెండు వారాలుగా ఇదే పనిలో ఉన్నాడు. బ్యాంక్ అధికారులు అలర్ట్ అయి డబ్బు డిపాజిట్ అయిన అకౌంట్ చూసేసరికి అందులో డబ్బుల్లేకపోవడంతో షాక్ అయ్యారు.

Read Also : కొవిడ్ టీకా సైడ్ ఎఫెక్ట్స్ నుంచి రిలీఫ్ కోసం ఈ ఐదు ఫుడ్స్ తీసుకోండి..!

కొద్ది రోజుల పాటు ఆ వ్యక్తి ఆచూకీ కోసం వెదికి ఎట్టకేలకు 2022 ఏప్రిల్ 21న కనిపెట్టారు. తన అకౌంట్ లో నుంచి డబ్బులుపోయాయని, తిరిగి తీసుకురాలేమని ఈ నేరానికి తగిన శిక్ష అనుభవిస్తానని ఒప్పుకున్నాడు. బ్యాంక్ అధికారులు అతనిపై దొంగతనం కేసు నమోదు చేయడానికి వీల్లేకుండాపోయింది. ఎట్టకేలకు న్యాయవాదులను సంప్రదించి దావా వేయడం ద్వారా కేసు బుక్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు