ఔరా..ఏమి ప్రతిభ .! ఆకులతో అవలీలగా అద్భుతమైన చిత్రాలు!!

  • Publish Date - November 28, 2020 / 04:04 PM IST

japanese artist leaf cutouts lito leafart : తమలో ఉన్న లోపాల్నే చరిత్ర సృష్టించిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అలాగే సమస్య ఉందని బాధపడుతూ కూర్చుంటే వారిలో దాగున్న ప్రతిభ బైటపడదు. దాన్నే నమ్మాడు జపాన్ కు చెందిన లిటో అనే వ్యక్తి.

 

ఆకుపై సైకిల్ ఫీట్..అద్దిరిపోయింది కదూ..ఆపై సూర్యుడి అందాలు 



వావ్..చీమలే ఆ భారీ జంతువుకి దారి చూపుతున్నాయా..!!

ఎత్తును చూసి కృంగిపోతే కొండ ఎక్కలేం అనేది సామెత. అలాగే భయపడితే వీధి కుక్క కూడా వెంటపడి తరుముతుంది. ఎదురు తిరిగితే తోక ముడుస్తుంది. అలాగే తమలో ఉన్న లోపాన్నే తలచుకుని తమలో ఉన్న ప్రతిభను మరిచిపోతే అతను మనిషికాదని నమ్మాడు లిటో.

గాల్లో ఎగరటానికి సిద్దంగా ఉన్న కారు

అంతే అతనిలో అద్భుతమైన కళాకారుణ్ని వెలికిగి తీసి ఇటువంటి కళకూడా ఒకటుందా? అనిపించాడు. ఆకులతో అందమైన బొమ్మల్ని తయారు చేసి అందరినీ అబ్బురపరిచాడు. సోషల్‌మీడియాలో హీరో అయ్యాడు.



ఆయన చేతిలో ఓ అద్భుతమైన బొమ్మ ఉంటుంది. అది చెక్కపై చెక్కినది కాదు. ఒక చెట్టు ఆకుతో తయారు చేసింది. ఆకులతో అందమైన ఆకృతులుగా మలిచి దళ శిల్పిగా పేరు తెచ్చుకున్నాడు లిటో.

ఆకును అంత చక్కగా మలచడానికి ఆయన కొన్ని గంటల పాటు కష్టపడ్డాడు. అసలీ ఆకుల మీద అందమైన బొమ్మలు వేయడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాల్సిందే.



అచ్చంగా నీళ్లు తాగుతున్నట్లుంది కదూ.. 

లిటో ADHD అనే సమస్యతో బాధపడుతున్నాడు. ADHD అంటే అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్‌. ఈ సమస్య ఉన్న వాళ్లు ఒక్క పని కూడా శ్రద్ధతో పూర్తి చేయలేరు. మధ్యలోనే ఆపేస్తారు. ఏకాగ్రత అస్సలు కుదరదు.

ఆకులో ఉడుతమ్మ పిల్లల ఫ్యామిలీ..ఎంత బాగుందో.. 



తనకున్న సమస్య నుంచి బయటపడటం కోసం లిటో లీఫ్‌ ఆర్ట్‌వర్క్‌ను ఎంచుకున్నాడు. ఒకే ఆర్ట్‌వర్క్‌పై ఫోకస్‌ పెట్టి గంటల తరబడి పనిచేస్తున్నాడు. అస్సలు ఖాళీగా ఉండదలచుకోలేదు. ADHD చికిత్సలో భాగంగా రిటో రోజులో ఆకులను వివిధ ఆకృతుల్లో కట్ చేస్తుంటాడు.

ఆకులో ఒదిగిపోయిన ఫ్లెమింగో అందమైన ఫ్యామిలీ



అలా కట్ చేసే ఆకృతుల్ని చూస్తే కళ్లు తేలేయాల్సిందే. ఇలాకూడా బొమ్మల్ని చేయొచ్చా? అని ఆశ్చర్యపోవాల్సిందే. ఆకుతో లిటో చెక్కిన అందేనంటీ కట్ చేసిన బొమ్మల్ని మీరు కూడా చూడండీ కచ్చితంగా కళ్లార్పకుండా చూస్తారు. నిజ్జంగా గ్యారంటీ.

కాగా..లిటో ఆర్ట్‌వర్క్స్‌ “Lito Leaf art” సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రిటో ప్రతిభకు హ్యాట్సా్ అంటు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి మీరు కూడా చూడండీ ఈ ఆకుల చిత్రాల్ని..

అడవి అందాలన్నీ ఈ ఆకుల్లోనే దాగున్నాయా..అనిపించేలా ఉన్న లిటో ఆకుల చిత్రాల అందాలు మీకోసం..