కొవిడ్ వ్యాప్తి పెరిగిపోవడంతో వూహాన్ లోని చాలా హాస్పిటల్స్ హైటెక్ డివైజ్ లు వాడడం మొదలుపెట్టాయి. పేషెంట్లకు ట్రీట్‌మెంట్ ఇవ్వడంలో, మెడిసిన్లు ఇచ్చి ప్రొటెక్షన్ తో ఉండడానికి, కొన్ని మెడికల్ సెంటర్లు రోబోలను వాడేస్తున్నాయి. ఇందులో భాగంగానే పేషెంట్ల టెంపరేచర్స్, క్లీన్ అప్, మీల్స్ డెలివరీ, మెడికేషన్‌ల కోసం రోబోలను వాడుతున్నారు.
వాటిని లేటెస్ట్ టెక్నాలజీతో మానిటర్ చేస్తూ.. పేషెంట్ల రికార్డులను డాక్టర్లు గమనించేందుకు వాడుతున్నారు. కొద్ది నెలలుగా టెక్నలాజికల్ గా డెవలప్‌మెంట్ సాధించి ఇతర దేశాలు మరింత ముందుకు వస్తున్నాయి. ఆశ్చర్యకరంగా రోబోలనేవి హాస్పిటల్స్ పని కోసమే ఉపయోగపడటం లేదు. పబ్లిక్ ఏరియాల్లో విజిలెన్స్ సేవల కోసం కూడా రోబోలు పనిచేస్తున్నాయి.
సోషల్ డిస్టెన్సింగ్ వాడమని చెప్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఈ పద్ధతినే ఫాలో అయిపోతున్నారు. సింగపూర్ లో రోబో డాగ్ ను వాడి సామాజిక దూరం పాటించేలా చేస్తున్నారు. బోస్టన్ డైనమిక్స్ దీనిని రూపొందించింది. అయితే జపాన్ లోని ఏడు అడుగుల ఎత్తు ఉన్న రోబో.. కిరాణా దుకాణంలో పనివాళ్ల స్థానాన్ని భర్తీ చేస్తుంది.
రోజువారీ పనులకు ఎవరూ రాకపోతుండటంతో ఈ టెక్నిక్ వాడుతున్నారు. వీటి ద్వారా చెల్లించాల్సింది తక్కువే కాకుండా.. త్వరగా అలసిపోవడం లేదని చెప్తున్నారు. చాలా జపాన్ స్టోర్లలో మనుషులకు బదులు రోబోలనే వాడుతున్నారు. జనాభాలో 1/3వ వంతు మంది యువ కార్మికులే ఉన్నారు. మిగిలిన వారంతా.. 65ఏళ్లు పైబడ్డ వారే.
ఇలా చూస్తే జపాన్ లోని చాలా షాపులలో ఏడడుగుల రోబోలే పనిచేస్తున్నాయి. మోడల్ టీ రోబోలను ఫ్యామిలీ మార్ట్ ప్రేరణతో క్రియేట్ చేశారు. కాకపోతే ఇవి స్వయంగా పనిచేయవు. వీటికి ఓ హ్యూమన్ ఆపరేటర్ ఉండాల్సిందే.