Jeff Bezos Skittles : బ్లూ ఆరిజిన్ వ్యోమనౌకలో స్కిటిల్స్ కాండీతో ఆడిన బెజోస్ బృందం.. వీడియో వైరల్!

ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. బ్లూ ఆరిజిన్ సంస్థ న్యూ షెపర్డ్ (New Shepard) వ్యోమనౌకలో జెఫ్ బెజోస్ బృందం రోదసీలోకి వెళ్లొచ్చింది.

Jeff Bezos Skittles : ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. బ్లూ ఆరిజిన్ సంస్థ న్యూ షెపర్డ్ (New Shepard) వ్యోమనౌకలో జెఫ్ బెజోస్ బృందం రోదసీలోకి వెళ్లొచ్చింది. అంతరిక్షంలో వెళ్లిన క్రమంలో బెజోస్ బృందం గ్రావిటీపై ప్రయోగం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో స్కిట్టెల్స్‌తో నలుగురు సరదాగా ఆడుకున్నారు.

అది గాల్లో ఎగరడాన్ని చూసి వారంతా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంది. ఈ వీడియోను ది న్యూయార్క్ టైమ్స్ అధికారిక ట్విట్టర్ లో షేర్ చేసింది. ఒకరి చేతిలో స్కిట్టెల్స్ క్యాండీని ఒకరి నుంచి మరొకరికి విసురుతూ ఆడారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ BE-3 ఇంజిన్లతో అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.

పది నిమిషాల పాటు అంతరిక్షంలో గడిపారు. ఆ తర్వాత ప్యారాచూట్స్ ద్వారా తిరిగి భూమిపైకి సురక్షితంగా దిగారు. స్పేస్ టూరిజం లక్ష్యంగా జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర కొనసాగింది. బెజోస్ తో పాటు రోదసీలోకి 82ఏళ్ల మహిళా పైలట్ వేలీ ఫంక్, 18ఏళ్ల ఓలివర్ డేమన్ మొత్తం ముగ్గురు పర్యాటకులు వెళ్లారు. ప్యారాచూట్ల ఉన్న క్యాప్సూల్స్ ద్వారా భూమిపైకి బెజోస్ బృందం భూమిపై సురక్షితంగా ల్యాండ్ అయింది.

ఈ స్పేస్ క్రాఫ్ట్.. 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు వెళ్లింది. తద్వారా తొలి వాణిజ్య వ్యోమనౌక ద్వారా బ్లూ ఆరిజన్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. భూమి నుంచి 106 కిలోమీటర్లు ఎత్తుకు ప్రయాణించింది. బెజోస్ తో పాటు అంతరిక్షంలోకి అడుగుపెట్టిన వేలిఫంక్ అతిపెద్ద వయస్సురాలు, అలాగే 18ఏళ్ల కుర్రాడుగా ఓలివెర్ డేమన్ సరికొత్త రికార్డు నెలకొల్పారు.

ట్రెండింగ్ వార్తలు