Mackenzie Scott : రూ.2లక్షల కోట్లకుపైగా విరాళం.. ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన మెకెంజీ స్కాట్.. ఎవరీమె..?

Jeff Bezos Ex Wife Mackenzie Scott : అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ స్కాట్ ప్రపంచంలోనే అత్యధిక విరాళాలు అందించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 2019 తర్వాత రూ.2.2 లక్షల కోట్లకు పైగా దానం చేసి ఫోర్బ్స్ జాబితాలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

mackenzie scott

  • ఏడేళ్లలో రూ.2.53లక్ష కోట్ల విరాళాలు
  • జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ స్కాట్ అరుదైన రికార్డు
  • ప్రపంచంలోనే అత్యధిక విరాళాలు ఇచ్చిన మహిళగా గుర్తింపు

Jeff bezos ex wife mackenzie scott : ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది కుబేరులు పేద ప్రాంతాల్లోని ప్రజల అభ్యున్నతికి, పలు స్వచ్ఛంద సంస్థలకు, యూనివర్శిటీలకు, విద్యా సంస్థలకు భారీ స్థాయిలో విరాళాలు ఇవ్వడం చూస్తుంటాం. ఆ కోవలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ స్కాట్ ఒకరు. ప్రస్తుతం ఆమె ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా చేశారు.. తన దాన గుణాన్ని మరోసారి చాటుకున్నారు. తన అమెజాన్ షేర్లలో ఏకంగా 42శాతం వాటాను అమ్మి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 186 యూనివర్శిటీలు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ గ్రూపులకు కిందటేడాది భారీ మొత్తంలో విరాళాలిచ్చారు.

Also Read : Supreme Court on Housewife : గృహిణి కాదు దేశ నిర్మాత..! సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. ఇల్లాలి సేవలకు కొత్త నిర్వచనం..

మెకెంజీ స్కాట్ 2012 నుంచి ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా విరాళాలు అందించిన వ్యక్తిగా నిలిచినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. 2019లో జెప్ బెజోస్‌తో ఆమె విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత తనకు వచ్చిన వాటాలో పెద్దమొత్తంలో విక్రయించిన మెకెంజీ స్కాట్ .. ఆ సంపదలో అత్యధిక మొత్తాన్ని సామాజిక సేవలకు వెచ్చిస్తున్నారు. గత ఏడేళ్లలో ఆమె సుమారు 26.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.2.53లక్షల కోట్లు) విరాళాల రూపంలో అందించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో అమెరికాలో అత్యధిక డొనేషన్లు ఇచ్చిన వ్యక్తుల్లో వారెన్ బఫెట్, బిల్ గేట్స్ తరువాత ఆమె మూడో స్థానంలో నిలిచారు.

2025 సంవత్సరంలో ఆమె ఏకంగా 7.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.68వేల కోట్ల) విరాళాలు ఇచ్చి సరికొత్త రికార్డు సృష్టించారు. మెకెంజీ స్కాట్ విద్య, సామాజిక న్యాయం, విపత్తు సహాయం, వెనుకబడిన వర్గాల అభివృద్ధి వంటి రంగాల్లో పనిచేస్తున్న వేలాది సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అంతేకాక.. చారిత్రాత్మకంగా గుర్తింపు ఉండి మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకబడిన విద్యా సంస్థలు అదేవిధంగా సామాజిక సేవా సంస్థలకు ఆమె భారీగా విరాళాలు ఇస్తుంటారు.

మెకెంజీ స్కాట్‌కు ప్రస్తుతం 55ఏళ్లు. గతేడాది హోవార్డ్ యూనివర్శిటీకి రికార్డు స్థాయిలో 80 మిలియన్లు విరాళంగా ఇచ్చారు. అదేవిధంగా పేద, నల్లజాతీయుల ఉన్నత విద్యకోసం పనిచేసే ‘10,000 డిగ్రీస్’ సంస్థకు 42 మిలియన్లు, స్థానిక గిరిజన విద్యార్థుల నిధి (యూఎస్‌సీఎఫ్)కి భారీగా నిధులు కేటాయించారు. ఇందుకోసం ఆమె 12.6 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు.

ప్రస్తుతం ఆమె 8.11 కోట్ల షేర్లను హోల్డ్ చేస్తున్నారు. మరోవైపు.. ఇంతపెద్దమొత్తంలో భారీ విరాళాలు ఇచ్చిన తరువాత కూడా మెకెంజీ స్కాట్ నికర ఆస్తివిలువ ఫోర్బ్స్ అంచనా ప్రకారం.. 29.9 బిలియన్ డాలర్లుగా ఉంది.