జడ్జి నోటి దురద: అత్యాచారం చేస్తుంటే ఏం చేస్తున్నావ్

  • Publish Date - April 7, 2019 / 08:19 AM IST

అత్యాచారం ఆడ పుట్టుకల పాలిట శాపంగా మారుతోంది. ఇటువంటి ఘోరాలకు పాల్పడినవారికి శిక్షలు పడటం ఎలా ఉన్నా న్యాయం కోసం న్యాయస్థానం మెట్లెక్కి బాధిత మహిళలు మాత్రం మరింత కృంగిపోయేలా వ్యహరించాడు ఓ జడ్జీ. బాధితురాలికి ఆత్మస్థైర్యాన్ని కలిగించి అన్యాయాన్ని చెప్పుకునేలా చేయాల్సింది పోయి దారుణమైన ప్రశ్నలు వేసిన జడ్జీ వివాదాలకు కేంద్రంగా మారాడు.  ఈ నోటి దురదకు చెక్ పెట్టాలనుకుంటోంది కోర్టు ప్యానల్. సస్పెండ్ చేసే యోచనలో ఉంది. 
అత్యాచారానికి గురైన మహిళతో అసభ్యంగా మాట్లాడిన న్యూజెర్సీలోని ఓషన్ కౌంటీ జడ్జిని మూడు నెలలపాటు సస్పెండ్ చేసేందు చర్యలు తీసుకుంటోంది కోర్టు ప్యానల్. పలు బాధలకు గురై కోర్టుకు వచ్చిన మహిళలను విచిత్రమైన ప్రశ్నలు అడుగుతూ..వారిని మరింతగా బాధపెడుతున్నాడంటూ జాన్ రుస్సో అనే జడ్జిపై పలు ఫిర్యాదులు వచ్చాయి. సదరు జడ్జి కొన్ని సంవత్సారాలుగా జాన్ ఇలానే ప్రవర్తిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

ఈ క్రమంలో అత్యాచారానికి గురైన ఓ మహిళ కోర్టులో హాజరైంది. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంది. ఆమె చెప్పటం పూర్తయిన తరువాత జడ్జి జాన్ అత్యాచారం చేస్తున్న సమయంలో రెండు కాళ్లు ముడుచుకోలేదా..శరీరాన్ని రక్షించుకోవాలిగానీ అలా వదిలేసావా..వెంటనే పోలీసులకు ఫోన్ చేయలేదా? వారి నుండి తప్పించుకోడానికి కనీస ప్రయత్నం కూడా చేయకుండా అలా చేయటమేంటి అంటే పలు వివాదాస్పద ప్రశ్నలు వేశాడు. వాటికి వీలైనంత వరకు సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించింది. తరువాత అత్యాచార బాధితులను ఇటువంటి ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదంటూ జడ్జిపై ప్యానెల్ విరుచుకుపడింది. 
 

మరో కేసు విషయంలో భార్యకు 10 వేల డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని భర్తను కోర్టు ఆదేశించింది.కానీ సదరు జడ్జికి ఆ భర్తకు మంచి పరిచయం ఉండటంతో 10వేల డాలర్లను 3 వందల డాలర్లకు తగ్గించినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఒకటీ రెండు కాదు ఇటువంటి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి.ఈ క్రమంలో 9 మంది సభ్యులతో కూడిన ప్యానెల్ జడ్జికి ఎటువంటి శిక్ష వేయాలా అని తెగ తర్జన భర్జన పడుతోంది. మూడు నెలల పాటు సస్పెండ్ చేయాలని కొందరు సభ్యులు అభిప్రాయపడుతుంటే అది చాలదు ఆరునెలలైనా సస్పెండ్ చేయాలంటూ మరో నలుగు సభ్యులు వాదిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన తీర్పు జులైలో రానుంది.