బిగుస్తున్న ఉచ్చు…ట్రంప్ అభిశంసనపై ఓటింగ్
- venkaiahnaidu
- Published On : December 12, 2019 / 11:56 AM IST
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై యూఎస్ హౌస్ జ్యుడిషియరీ కమిటీ.. బుధవారం ప్రారంభించిన అభిశంసన ప్రక్రియ ఇవాళ(డిసెంబర్-12,2019)ముగియనుంది.
ఇవాళ అభిశంసన తీర్మానంపై చర్చ అనంతరం అభిశంసన అభియోగాలపై ఓటింగ్ జరపనున్నారు. ట్రంప్ అధికార దుర్వినియోగానికి, అమెరికన్ కాంగ్రెస్ కార్యకలాపాలను ఆటంకపరిచేందుకు ప్రయత్నించారని డెమొక్రాట్లు అభియోగాలు మోపి.. అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
వీటిపై జ్యుడిషియరీ కమిటీ చర్చించి అవసరమైన సవరణలు చేసే అవకాశం ఉంది.ట్రంప్‌పై అభిశంసన తీర్మానానికి సవరణలు చేయాలని రిపబ్లికన్లు ప్రతిపాదిస్తున్నారు. ఇందు కోసం 9 పేజీల సవరణ ప్రతిపాదనలు రూపొందించారు. అయితే డెమొక్రాట్లు ఇందుకు అంగీకరించే అవకాశాలు కనిపించడం లేదు.
ట్రంప్.. 2020 ఎన్నికల్లో తన స్వప్రయోజనాల కోసం ప్రత్యర్థుల్ని అణగదొక్కే ప్రయత్నాల్లో ఉన్నారని ఆరోపిస్తున్నారు. డెమొక్రాట్ల అభియోగాలను పరిశీలించి అభిశంసన తీర్మణాన్ని హౌస్ ఫ్లోర్‌కు పంపడానికి ఓటింగ్ జరుపుతుంది. ఇవాళ రాత్రి ఈ ఫలితాలు వెలువడనున్నాయి.
