Kfc Plant Based 'chicken' (1)
KFC plant-based ‘chicken’: KFC. అంటే గుర్తుకొచ్చేది ఫ్రైడ్ చికెన్.ఫ్రైడ్ చేసి KFC లెగ్స్ వరల్డ్ ఫేమస్. ఒక్క లెగ్ పట్టుకుంటే అలా నోట్లోకి జారిపోతుంది. KFC కంపెనీ పేరులోనే ఫ్రైడ్ చికెన్ ఫేమస్ అయ్యింది. నాన్ వెజ్ ప్రియులకు KFC లెగ్స్ అంటే ప్రాణం పెడతారు.KFC చికెన్ తింటుంటే ఆ మజానే వేరు. కానీ నాన్ వెజ్ తిననివారికి కూడా చక్కటి మజా అందిస్తామంటోంది KFC. అదే వెజ్ చికెన్. వెజ్ ఏంటీ చికెన్ ఏంటీ? ఫుల్ డిఫరెంట్ గా ఉందే అనుకుంటున్నారా? కాస్త తిరకాసుగా కూడా ఉందే అనుకుంటున్నారా?
Read more: burger king viral Tweet : మా బర్గర్ తినొద్దు..పాపం..వాళ్లవి తినండీ..
నిజమే కానీ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్అయిన KFC ఓ వినూత్న చికెన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ‘మొక్కలతో తయారు చేసే చికెన్’…! అదే KFC… మొక్కల ఆధారిత చికెన్.. బియోండ్ ఫ్రైడ్ చికెన్ (Beyond Fried Chicken) గురించి ప్రకటించింది…నాన్ వెజ్ తిననివారికంటే వీగన్లు మరీ దారుణం..వీరు కేవలం మొక్కల ఆధారిత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. కనీసం పాలు పాల పదార్ధాలు కూడా తినరు. మరి వీగన్లకు ప్రొటీన్లు ఎలా లభిస్తాయి?మాంసం, చికెన్‌లో ఉండే ప్రోటీన్లు… వెజ్, వేగన్ ప్రియులకూ కూడా అందేలా చేయటానికే మొక్కల ఆధారిత ఫ్రైడ్ చికెనే అంటోంది KFC.
మొక్కల ఆధారిత చికెన్.. బియోండ్ ఫ్రైడ్ చికెన్ (Beyond Fried Chicken) గురించి ప్రకటించింది KFC కంపెనీ. జనవరి 10 నుంచి అమెరికాలోని 4000కు పైగా KFC లొకేషన్లలో ఈ మొక్కల ఆధారిత చికెన్ లభిస్తుందని ప్రకటించింది.
Read more : Rrare Chip Rs.14 lakh : ఒక్క ఆలూ చిప్ ధర రూ.14 లక్షలు..! అందుకే అంతరేటు..!!
కానీ ఇక్కడో తిరకాసుకూడా ఉందండోయ్..ఈ మొక్కల చికెన్ రియల్ చికెన్ లాగానే కనిపిస్తుందనీ కాబట్టి అది పక్కా చికెన్ అని అనుకోద్దని సూచించింది. వీగన్లూ, వెజియేరియన్లూ తినే ఆహారం లాగా ఇది కనిపించదని తెలిపింది. కాబట్టి ఇది వెజ్ ప్రియులు, వీగన్లకు నచ్చుతుందా? వాళ్లు దీన్ని ఏక్సప్ చేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే… మొక్కల నుంచి చేసినా… చూడటానికి అది కోడి చికెన్‌లా ఉంటే వెజిటేరియన్లు తినటానికి ఇష్టపడరు. ఇక వీగన్లు అయితే అస్సలు ఇష్టపడకపోవచ్చు. మరి అటువంటటప్పుడు దాన్ని తయారుచేసి ప్రయోజనం ఏముంటుందనే ప్రశ్న కూడా వస్తోంది.
కానీ వారు తింటారా? తినరా? అనేది పక్కన పెడితే KFC కంపెనీ చేసిన ఈ యత్నం చేయకూడదనిలేదుగా..అది వారి వినూత్న యత్నం. KFC అంటే కేవలం నాన్ వెజ్ మాత్రమే కాదని ఇలా నాన్ వెజిటేయన్లతో పాటు వీగన్లను కూడా తమ కష్టమర్లుగా చేసుకోవటానికి ఇదొక యత్నం. సో ఎన్నో రకాల ఫుడ్ఐటెమ్స్ వస్తున్నప్పుడు ఈ మొక్కల చికెన్ కూడా KFCలో ఓ ట్రెండ్ క్రియేట్ అని చెప్పొచ్చు.
Read more : Manipur Assembly Elections 2022 : ఈశాన్య రాష్ట్రంలో సింగిల్‌గా అధికారం చేపట్టాలని చూస్తున్న కమలనాధులు
కాగా.. KFC ఈ చికెన్ కాని చికెన్‌ని 2019 ఆగస్టులోనే అమెరికాలోని అట్లాంటాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. అది 2020లో నాష్‌విల్లే, చార్లొట్టే, దక్షిణ కాలిఫోర్నియాలకు విస్తరించింది. తాజాగా KFC బియోండ్ మీట్ సంస్థతో పార్ట్‌నర్ అయ్యింది. అలా KFCలో జనవరి 10 నుంచి ఈ మొక్కల చికెన్ బకెట్లు లభిస్తాయని తెలిపింది. వీటిని కాంబో మీల్ ద్వారా కూడా పొందవచ్చని KFC తెలిపింది.