King Charles III: బ్రిటన్ రాజు పట్టాభిషేకం ముగిసింది.. మరి ఇప్పుడు ఏం జరుగుతోందో తెలుసా?

King Charles III: ఇవి మామూలుగా జరగవు. పట్టాభిషేకం రెండో రోజులో భాగంగా వేలాది పార్టీలు జరుగుతున్నాయి.

King Charles III: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌-II (Queen Elizabeth) అనారోగ్య కారణాలతో గత ఏడాది సెప్టెంబరులో కన్నుమూయడంతో నిన్న బ్రిటన్ రాజుగా ఆమె కుమారుడు కింగ్ ఛార్లెస్-III (King Charles III) పట్టాభిషేకం జరిగింది. మరి ఇప్పుడు ఏం జరుగుతోందో తెలుసా? వీధుల్లో పార్టీలు, లంచ్, కచేరీ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇవి మామూలుగా జరగవు. పట్టాభిషేకం రెండో రోజులో భాగంగా వేలాది పార్టీలు జరుగుతున్నాయి. ఇక సంగీత ప్రదర్శనల్లో చాలా మంది స్టార్ లు పాల్గొంటున్నారు. కమ్యూనిటీ ఈవెంట్లలో రాయల్ ఫ్యామిలీ సభ్యులు పాల్గొంటారు. గత సెప్టెంబరులో బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌-II పార్థివ దేహాన్ని విండ్సర్ కోటలోని సెయింట్ జార్జ్ చాపెల్‌ లో ఖననం చేసిన విషయం తెలిసిందే.

అదే విండ్సర్ కోటలో రాజ కుటుంబ వేడుకలు జరుగుతుంటాయి. ఇదే కోట వద్ద అప్పటి కాలపు రాజ కుటుంబ సభ్యుల ఆత్మలు తిరుగుతుంటాయని పదే పదే వదంతులు వ్యాపిస్తుంటాయి. కొన్ని నెలల క్రితం బ్రిటన్ రాణి ఎలిజబెత్-IIతో పాటు ఆమె సోదరి ప్రిన్సెస్ మార్గరెట్ కలిసి ఈ కోట వద్ద గతంలో ఓ ఆత్మను చూశారంటూ ప్రచారం జరిగింది.

ఆ ఆత్మ ఎలిజబెత్-I దని అక్కడి మీడియా కూడా పేర్కొనడం గమనార్హం. అక్కడే ఇప్పుడు పార్టీ జరగనుంది. ఎడిన్‌బర్గ్ డ్యూక్, డచెస్ కూడా క్రాన్లీలో జరిగే బిగ్ లంచ్ పార్టీకి హాజరయ్యారు. మరికొందరు రాజకుటుంబ సభ్యులూ ఇందులో పాల్గొంటారు. పట్టాభిషేక కచేరీలు కూడా ఈ కోటలోనే జరుగుతున్నాయి.

King Charles III Video: ఈ కాలంలో చూడలేమనుకున్న అద్భుత దృశ్యం.. బంగారు రథంపై రాజు, రాణి ఊరేగింపు, పట్టాభిషేకం

ట్రెండింగ్ వార్తలు