koala hanging from Christmas tree : ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. కరోనా నేపథ్యంలో నియమ నిబంధనల మధ్య వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ పండుగ రాగానే..ఇంటి ఎదుట క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేస్తుంటారు క్రైస్తవులు. ఇలాగే..ఓ కుటుంబం చెట్టును ఏర్పాటు చేసింది. కానీ..koala అనే జంతువు ఆ చెట్టును అంటిపెట్టుకొంది. ఎంత ప్రయత్నించినా..ఆ జంతువు క్రిస్మస్ ట్రీని వదిలిపెట్టలేదు. చివరకు రెస్క్యూ టీం వచ్చి జంతువును బలవంతంగా తీసి అడవుల్లో వదిలిపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతోంది.
Adelaide లోని Coromandel Valley లో ఓ కుటుంబం..క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. మధ్యాహ్న సమయంలో పని కోసం బయటకు వెళ్లారు. కుక్కను బయట వదిలి…తలుపులు మూసివేసి వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చాక…అందంగా అలంకరించిన క్రిస్మస్ ట్రీపై ఎదో జంతువు ఉన్నట్లు కనుగొన్నారు. అది koala గా గుర్తించారు. దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా..అది గట్టిగా పట్టుకుని అలాగే కూర్చొంది. జంతు విషయాలను ఇతరులకు చేరవేయడంలో పేరుగాంచిన..The Dodo ట్విట్టర్ వేదికగా వీడియో ట్వీట్ చేసింది. Wild koala shows up in family’s Christmas tree and does NOT want to leave అనే క్యాప్షన్ జత చేసింది. చివరకు రెస్క్యూ టీం అక్కడకు చేరుకుని జాగ్రత్తగా Koalaను బయటకు తీశారు. దానిని సురక్షితంగా అడవుల్లో వదిలిపెట్టారు. అమాంతం పక్కనే ఉన్న చెట్టుపైకి ఎక్కి వెళ్లింది.
Wild koala shows up in family’s Christmas tree and does NOT want to leave?❤️️ pic.twitter.com/Ejm33jzXn7
— The Dodo (@dodo) December 23, 2020