Koreas exchange warning shots: తెల్లవారుజామునే పరస్పరం హెచ్చరికలు చేస్తూ ఉత్తర కొరియా, దక్షిణ కొరియా కాల్పులు

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా సరిహద్దుల వద్ద మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వివాదాస్పద పశ్చిమ సముద్ర ప్రాంతం వద్ద ఇరు దేశాలు ఇవాళ తెల్లవారుజామున పరస్పరం హెచ్చరికలు చేస్తూ కాల్పులు జరుపుకున్నాయి. వరుసగా క్షిపణి పరీక్షలు చేస్తూ ఉత్తర కొరియా దుందుడుకు చర్యలకు పాల్పడడంతో ఇప్పటికే కలకలం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిస్థితులు మరింత దిగజారడం గమనార్హం.

Koreas exchange warning shots: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా సరిహద్దుల వద్ద మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వివాదాస్పద పశ్చిమ సముద్ర ప్రాంతం వద్ద ఇరు దేశాలు ఇవాళ తెల్లవారుజామున పరస్పరం హెచ్చరికలు చేస్తూ కాల్పులు జరుపుకున్నాయి. వరుసగా క్షిపణి పరీక్షలు చేస్తూ ఉత్తర కొరియా దుందుడుకు చర్యలకు పాల్పడడంతో ఇప్పటికే కలకలం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిస్థితులు మరింత దిగజారడం గమనార్హం.

సముద్ర సరిహద్దు నిబంధనలను ఉత్తర కొరియా ఉల్లంఘించిందని దక్షిణ కొరియా తెలిపింది. కొరియా ద్వీపకల్పంలో స్థిరత్వం కోసం 2018లో చేసుకున్న ఒప్పందాన్ని ఉత్తర కొరియా ఉల్లంఘించిందని చెప్పింది. అయితే, దక్షిణ కొరియాకు హెచ్చరిక చేయడానికి తాము 10 రౌండ్ల శతఘ్ని గుళ్లతో కాల్పులు జరిపినట్లు ఉత్తర కొరియా పేర్కొంది.

కాగా, ఇప్పటికే వరుసగా క్షిపణి పరీక్షలు చేసిన ఉత్తర కొరియా చర్యలపై అమెరికా, దక్షిణ కొరియా అప్రమత్తమయ్యాయి. ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు ఆపకపోవడంతో అమెరికా న్యూక్లియర్ ఆధారిత వాహక నౌక యూఎస్ఎస్ రొనాల్డ్ రీగాన్, దక్షిణ కొరియా యుద్ధ నౌకలు కొరియన్ ద్వీపకల్పం తూర్పు తీర ప్రాంతంలోని అంతర్జాతీయ జలాల్లో విన్యాసాలు కూడా చేపట్టాయి. అయినప్పటికీ ఉత్తర కొరియా ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు