సూర్యాపేటకు చెందిన డ్రిల్లింగ్ మ్యాన్ క్రాంతి కుమార్ కి అంతర్జాతీయ టాలెంట్ షోలో పాల్గొనే గొప్ప అవకాశం దక్కింది. ఫిబ్రవరి 9వ తేదీన లాస్ ఏంజెల్స్‌లో జరిగే అమెరికాస్ గాట్ టాలెంట్ కార్యక్రమంలో ఆడిషన్ ఇచ్చే అవకాశం క్రాంతి కుమార్ కు వరించింది.
అయితే క్రాంతి జాతీయ స్థాయిలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొని తన అద్భుత ప్రదర్శనతో ప్రజలను ఆకటుకుని ఎన్నో ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. మరిగే నూనెలో చేతులు పెట్టడం, డ్రిల్లింగ్ మిషన్‌తో ముక్కులో డ్రిల్ చేసుకోవడం, ఒకేసారి 32 పదునైన కత్తులను మింగడం వంటి పలు సహాస కృత్యాలు చేస్తుంటాడు.
ఆహ్వానం అందినా, అమెరికా వెళ్లేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో క్రాంతి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డిని ఆశ్రయించాడు. క్రాంతి టాలెంట్‌ను మెచ్చిన ఎమ్మెల్యే అమెరికా వెళ్లేందుకు కావాల్సిన ఆర్థిక చేయూతను అందించనున్నట్లు పేర్కొన్నారు.