Venezuela Landslide : వెనిజులాలో విరిగిపడ్డ కొండచరియలు .. 22మంది మృతి, 52మంది పైగా గల్లంతు

వెనిజులాలో కొన్ని రోజులుగా ఎడతెగక కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. సెంట్రల్ వెనిజులాలో వర్షం వల్ల కొండచరియలు విరిగిపడి 22మంది దుర్మరణంపాలయ్యారు.మరో 52మందికిపైగా గల్లంతయ్యారు.

Venezuela Landslide : వెనిజులాలో కొన్ని రోజులుగా ఎడతెగక కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. సెంట్రల్ వెనిజులాలో వర్షం వల్ల కొండచరియలు విరిగిపడి 22మంది దుర్మరణంపాలయ్యారు.మరో 52మందికిపైగా గల్లంతయ్యారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు సెంట్రల్ వెనిజులా అతలాకుతమవుతోంది. ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల్లో 1000మంది రెస్క్యూ సిబ్బంది పాల్గొన్నారు. గల్లంతు అయినవారి కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. కొండచరియిలు విరిగిపవటంతో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి..మరెన్నో ఇళ్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ కొండచరియలు విరిగిపడి పెను విధ్వంసం జరగటంతో ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.

భారీగా కురుస్తున్న వర్షఆలతో సెంట్రల్ వెనిజులాలోలని ఐదు చిన్న చిన్న నదులు పొంగిపొర్లుతున్నాయి. శనివారం రాత్రి కురిసిన వర్షాలకు పర్వతాలు నుంచి పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అలాగే వ్యవసాయం భూములు దెబ్బతిన్నాయి. తాగునీటి వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. నగరం అంతా బురదతో అస్తవ్యవస్థంగా మారింది. ఎక్కడ చూసినా మట్టి రాళ్లతో అధ్వాన్నంగా మారింది. పెద్ద పెద్ద బండరాళ్లకింద చిక్కుకున్న వ్యక్తులను కాపాడే చర్యలు కొనసాగుతున్నాయి.

బాధితులను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ తెలిపారు. బాధితుల కోసం రెస్య్యూ బృందాలు చర్యల్ని ముమ్మరం చేశాయి. గల్లంతు అయినవారి కోసం గాలిస్తున్నామని వెనిజులా పౌర రక్షణ శాఖ డిప్యూటీ మంత్రి కార్లోస్ వెరెజ్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఆదిారం కూడా కురుస్తున్న వర్షాలకు మరో మూడు సెంట్రల్ రాష్ట్రాల్లో కూడా కొండచరియలు విరిగిపడ్డాయని..కానీ ఎటువంటి ప్రాణనష్టం జరుగులేదని మంత్రి తెలిపారు. కాగా వెనిజులలాలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ఘటనలో చనిపోయినవారితో కలిసి మొత్తం మృతుల సంఖ్య 40కి పెరిగింది.

 

ట్రెండింగ్ వార్తలు