Latvia Womans
Rental Husband in Latvia : సాధారణంగా అబ్బాయిలకు సరిపడ అమ్మాయిలు లేరనే వార్తలు విని ఉంటాం.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిలు కొరత కారణంగా పెళ్లిళ్లు జరగని మగవాళ్లు ఎంతో మంది ఉన్నారు. ప్రతీ గ్రామంలో వీరి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కానీ, ఓ దేశంలో మాత్రం దీనికి భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. అందమైన అమ్మాయిలకు భర్తలు దొరకడం లేదట.. దీంతో వారు భర్తలను అద్దెకు తీసుకుంటున్నారు.
ఉత్తర ఐరాపాలోని లాత్వియా దేశంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. అక్కడ పురుషులకు డిమాండ్ పెరిగిపోయింది. పెళ్లి చేసుకునేందుకు, ఇంటి పనుల్లో సాయం చేసేందుకు భాగస్వామి దొరక్క మగతోడు కోసం ఆ దేశ మహిళలు నానాపాట్లు పడుతున్నారు. గత్యంతరం లేక ఇంటి పనుల్లో తమకు చేదోడువాదోడుగా ఉండేందుకు భర్తలను గంటలు, రోజులు లెక్కన అద్దెకు తెచ్చుకుంటున్నారు. లింగ నిష్పత్తిలో తేడా భారీగా పెరిగిపోవడం వల్లే ఆ దేశంలో ఈ వింత పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.
లాత్వియాలో పురుషుల జనాభాగా కంటే మహిళల జనాభా 15.5 శాతం అధికంగా ఉంది. ప్రతీ వంద మంది పురుషులకు 115 మంది స్త్రీలు ఉన్నారు. అదే 65ఏళ్లు అంతకంటే పైబడిన వారి విషయంలోనైతే పురుషుల కంటే స్త్రీలు రెండు రెట్లు అధికంగా ఉన్నారు. దీంతో తమ రోజువారీ జీవితంలో మగవాళ్లే లేకుండా పోయారని, పని ప్రదేశంలో ఎటు చూసినా మహిళలే కనిపిస్తున్నారని ఆ దేశ మహిళలు వాపోతున్నారు.
నిపుణుల అంచనా ప్రకారం.. లిత్వియా దేశంలో పురుషుల జీవితకాలం మహిళలతో పోలిస్తే గణనీయంగా తక్కువ. దీనికి ప్రధాన కారణాలు ఉన్నాయి. పురుషుల్లో ధూమపానం మూడు రెట్లు ఎక్కువ ఉంది. అధిక బరువు, ఒబేసిటీ సమస్య ఎక్కువగా ఉంది. ఆరోగ్యంపై తక్కువ శ్రద్ద ఉండడం వంటి కారణాలతో పురుషుల సంఖ్య సంత్సరాలుగా తగ్గుతోందట.
లిత్వియా దేశంలో మగవారి కొరత కారణంగా యువతులు, ఉద్యోగస్తులు భాగస్వాములు దొరకడంలో ఇబ్బంది పడుతున్నారు. ఓ మహిళ మాట్లాడుతూ.. తమ రోజువారీ జీవితంలో మగవాళ్లే లేకుండా పోయారు. పని ప్రదేశంలో ఎటు చూసినా మహిళలే కనిపిస్తున్నారు. దీంతో మా స్నేహితుల్లో చాలా మంది విదేశాలకు వెళ్లి అక్కడే బాయ్ ఫ్రెండ్స్ ను కలుసుకుంటున్నారని చెప్పింది. దేశంలో మగవారి కొరత వల్ల భాగస్వామి కోసం విదేశాలను ఆశ్రయించాల్సి వస్తుందని పలువురు మహిళలు ఆవేదన చెందుతున్నారు.
మగవారి కొరత పెరగడంతో అనేక మంది మహిళలు ఇంటి పనుల కోసం ప్రత్యేక సేవలకు మొగ్గుచూపుతున్నారు. ఇంటి పనుల్లో చేదోడు కోసం అక్కడి అందమైన మహిళలు భర్తలను అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా భర్తను బుక్ చేసుకొని వచ్చిన వారితో కలిసి ఇంటి పనులను పూర్తి చేసుకుంటున్నారు.
Komanda24 వంటి ప్లాట్‌ఫార్మ్‌లు “Men With Golden Hands” పేరుతో పురుషులను పంపిస్తున్నారు. వీరు ప్లంబింగ్, కార్పెంట్రీ, చిన్నచిన్న రిపేర్ పనులు, టెలివిజన్ ఇన్‌స్టాలేషన్ వంటి పనుల్లో సాయం అందిస్తారు. అలాగే Remontdarbi.lv అనే సర్వీస్‌లో ‘Husband for an Hour’ అని ఆన్‌లైన్‌లో లేదా ఫోన్‌లో బుక్ చేస్తే ఒక గంటలో ఇంటికి వచ్చి పని చేస్తారు. వీళ్లు గోడల పెయింటింగ్, కర్టెన్లు ఫిక్స్ చేయడం, చిన్నచిన్న మెకానికల్ పనులు ఇలా అనేక పనులు చేస్తారు. అక్కడ చాలామంది మహిళలు ఇలాంటి సేవలను వినియోగించుకోవడానికే మొగ్గు చూపిస్తారట.