నేపాల్ లో తుఫాన్ బీభత్సం: 25మంది మృతి 

  • Publish Date - April 1, 2019 / 04:27 AM IST

ఖాట్మండు : మండు వేసవిలో నేపాల్ దేశాన్ని తుఫాన్ వణికించేసింది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలకు 25మంది మృతి  చెందారు. మరో 400ల మంది తీవ్రంగా గాయపడ్డారు. వందలాదిమంది నిరాశ్రయులయ్యారు. దేశ రాజధాని ఖాట్మండు నగరానికి దక్షిణాన 120 కిలోమీటర్ల దూరంలోని బారా జిల్లాలోని పలు గ్రామాలు తుపాన్ ధాటికి చిగురుటాకులా వణికిపోయాయి. 

ఈ విపత్తుకు మతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నట్లుగా అధికారులు  అంచనా వేస్తున్నారు. భారీవర్షంతో పలు గ్రామాలు నీటమునిగిపోగా..గాలి ఉధ్ధృతికి చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయి, రోడ్లపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుఫాను సందర్భంగా నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మాట్లాడుతు..వరదనీటిలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు నేపాల్  నైట్ విజన్ సైనికులు హెలికాప్టర్లతో రంగంలోకి దింపామని..ఖాట్మండు వైమానికకేంద్రం నుంచి హెలికాప్టర్లను పంపించి ప్రమాదంలో ఉన్నవారిని సురక్షితప్రాంతాలకు తరలిస్తున్నామని తెలిపారు.