Bangladesh : పెళ్లి బృందంపై పడిన పిడుగు..16 మంది మృతి

వధువు, వరుడిని ఆశీర్వదించి...విడిదికి వెళుతున్న పెళ్లి బృందంపై పిడుగుపడింది. దీంతో 16 మంది చనిపోయారు. వరుడికి తీవ్రగాయాలు కాగా..వధువు అక్కడ లేకపోవడంతో తప్పించుకుంది.

Rain

Lightning Kills : అప్పటిదాక ఎంతో సంతోషంగా గడిపారు. ఎంతో అహ్లాదంగా..ఆనందంగా…బంధువులు, కుటుంబసభ్యులు ఉన్నారు. కానీ..అంతలోనే తీవ్ర విషాదం నెలకొంది. వధువు, వరుడిని ఆశీర్వదించి…విడిదికి వెళుతున్న పెళ్లి బృందంపై పిడుగుపడింది. దీంతో 16 మంది చనిపోయారు.

Read More : Folk Songs : ‘సారంగ దరియా’ నుండి ‘దిగు దిగు దిగు నాగ’ వరకు ఊపు ఊపుతున్న ఫోక్ సాంగ్స్..

వరుడికి తీవ్రగాయాలు కాగా..వధువు అక్కడ లేకపోవడంతో తప్పించుకుంది. ఈ విషాద ఘటన బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంది. చపైనవాబ్ గంజ్ జిల్లాలో ఓ ఇంట పెళ్లి జరుగుతోంది. వీరి వివాహానికి కుటుంబసభ్యులు, బంధువులు హాజరయ్యారు. షిప్ గంజ్ నగరంలో విడిది ఏర్పాటు చేశారు. విడిది ప్రాంతానిక వెళ్లాలంటే..నదీ దాటాల్సి ఉంటుంది.

Read More : Passenger Tied To Seat : ఎగురుతున్న విమానంలో షాకింగ్ ఘటన.. ప్యాసింజర్‌ను కట్టేసి..

వివాహానికి వచ్చిన ఓ బృందం పడవలో వెళుతున్నారు. ఒక్కొక్కరుగా పడవ దిగుతున్నారు. అప్పటికే భారీ వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడుతోంది. అకస్మాత్తుగా ఈ బృందంపై సెకన్ల వ్యవధిలో పిడుగు పడింది. దీంతో 16 మంది అక్కడికక్కడనే చనిపోగా…పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వరుడికి తీవ్రగాయాలు కాగా..వధువు ప్రమాద సమయంలో అక్కడ లేకపోవడంతో క్షేమంగా బయటపడింది. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.