Lightning strike..New Phosphorus : చెట్టుపై పడిన పిడుగు .. భూమిపై పుట్టిన కొత్త పాస్ఫరస్‌ పదార్థం..!!

ఏడు బండ్ల పేడలో ‘పిడుగు’పడితే బంగారం ముద్దు తయారవుతుందని పెద్దలు చెప్పేవారు. అది ఎంత వరకు నిజమో కాదో తెలియదు కానీ.. ఓ చెట్టుమీద పిడుగు పడటం వల్ల భూమి మీద ఓ కొత్తరకం పదార్థం పుట్టింది..!

Lightning strike creates new phosphorus :  ఏడు బండ్ల పేడలో ‘పిడుగు’పడితే బంగారం ముద్దు తయారవుతుందని (పిడుగు పరిమాణంలో)పెద్దలు చెప్పేవారు. అది ఎంత వరకు నిజమో కాదో తెలియదు కానీ.. ఓ చెట్టుమీద పిడుగు పడటం వల్ల భూమి మీద ఓ కొత్తరకం పదార్థం పుట్టింది..! ఓ చెట్టుపై పిడుగు పడటం వల్ల భూమిపై గతంలో ఎన్నడూ కనిపించని సరికొత్త పాస్ఫరస్‌ పదార్థం ఏర్పడిందని ఫ్లోరిడా యూనివర్శిటీకి చెందిన మాథ్యూ పసెక్‌ అనే శాస్త్రవేత్త గుర్తించారు.

అమెరికాలోని ఫ్లోరిడాలోని న్యూపోర్ట్ రిచీ ప్రాంతంలో ఇటీవల ఓ చెట్టుపై పిడుగు పడింది. ఈ ఘటన భూమిపై గతంలో ఎన్నడూ కనిపించని సరికొత్త పాస్ఫరస్‌ పదార్థం ఏర్పడటానికి కారణమైంది. ఈ కొత్త పాస్ఫరస్‌ పదార్థం ఘన రూపం శిలలా ఉందని పసెక్‌ తెలిపారు. దాన్ని చూస్తే ఓ శిల అనుకుంటాం అదో ఖనిజం అని అనుకోమని తెలిపారు.

ఫ్లోరిడా ఓ చెట్టుపై పడిన పిడుగు- దాని వేర్లపై పోగుబడిన ఐరన్‌ను, చెట్టు లోపల ఉన్న కార్బన్‌ను అధిక ఉష్ణోగ్రతతో మండించిందని..ఈ ప్రక్రియ ఫలితంగా చోటుచేసుకున్న రసాయనిక చర్యల వల్ల కొత్త పాస్ఫరస్‌ పదార్థం ఆవిర్భవించిందని తెలిపారు పసెక్. ఇటువంటి పదార్ధాల ఉనికి అంతరిక్షంలో మాత్రమే ఉంటుందని అన్నారు.

5,450 Thunderstorm : అరగంటలో అల్లాడించిన 5,450 పిడుగులు .. వణికిపోయిన ఒడిశా వాసులు

ఇటువంటి పదార్ధాన్ని గతంలో భూమిపై ఎక్కడా చూడలేదని ఇటువంటివి సహజయంగా ఏర్పడటం ఎన్నడూ చూడలేదన్నారు. ఉల్కలు, అంతరిక్షంలో ఇటువంటివి కనిపిస్తాయన్నారు. పిడుగు ఎక్కువగా చెట్లమీదనే పడుతుంటాయి. అలా ఓపిడుగు ఓ చెట్టుపై పడటం వల్ల ఆ ప్రాంతంలో ఉండే మొక్కలు, చెట్లు కాలిపోతాయి. పచ్చదనం అంతా నల్లగా మారిపోతుంది కాలిపోవటం వల్ల. అలా అసాధారణ పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో ఉండే భౌగోళిక పరిస్థితుల..మట్టి పరిస్థితులను బట్టి ఇటువంటి ఖనిజాలు ఏర్పడే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కాగా న్యూ పోర్ట్ రిచీలో ఓ చెట్టుమీద పిడుగు పడిన సందర్భంగా స్థానికులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ చెట్లు మొదట్లో ఏదో వింత పదార్థం కనిపించటంతో ఆశ్చర్యపోయారు. అక్కడ ఏదో రాయిలా ఉండే పదార్థాన్ని గుర్తించారు. కానీ అదేమిటో వారికి తెలియలేదు. కానీ అదేదో విలువైనదే అయి ఉంటుందని దాన్ని అమ్మకానికి పెట్టగా ఈ విషయం శాస్త్రవేత్త పసెక్ కు తెలిసి దాన్ని కొనుగోలు చేశారు. తరువాత దానిని పలు విధాలుగా పరిశీలించి..ప్రయోగాలు చేయగా పిడుగు చెట్టుమీద పడటం వల్ల చెట్ల వేర్లు కాలి ఇలా కొత్త రకమైన పదార్థం ఆవిర్భవించిందని గుర్తించారు.

 

ట్రెండింగ్ వార్తలు