Liz Truss becomes prime minister
Liz Truss becomes prime minister: బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ అధికారికంగా రాజీనామా చేశారు. అనంతరం లిజ్ ట్రస్ ఆ బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ క్వీన్ ఎలిజబెత్-IIను కలిసిన బోరిస్ జాన్సన్ రాజీనామా లేఖను సమర్పించారు. ఆయన రాజీనామాను ఎలిజబెత్-IIను అంగీకరించారు. దీంతో ఆయన ప్రధాని పదవి నుంచి దిగిపోయారు. అనంతరం ఎలిజబెత్-IIను లిజ్ ట్రస్ కలిశారు. దీంతో లిజ్ ట్రస్ ను అధికారికంగా యూకే ప్రధానిగా ఎలిజబెత్-II నియమించినట్లు అయింది.
బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ వేర్వేరుగానే లండన్ లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ కు వెళ్ళారు. అక్కడకు వెళ్ళే ముందు తన అధికారిక నివాసంలో బోరిస్ జాన్సన్ ప్రసంగించారు. కాగా, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి హోదాకు, ప్రధాని పదవికి పోటీ చేసి గెలిచిన లిజ్ ట్రస్ ముందు ఇప్పుడు అనేక సవాళ్ళు ఉన్నాయి. ద్రవ్యోల్బణం, జీవన వ్యయం(కాస్ట్ ఆఫ్ లివింగ్)ను ఆమె నియంత్రించాల్సి ఉంది.
వాటి వల్ల బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ దిగజారుతోంది. దీంతో ట్యాక్సులు తగ్గించడంతో పాటు తమ ఆర్థిక వ్యవస్థ బలపడడానికి, విద్యుత్తు సంక్షోభం, విద్యుత్తు సరఫరాపై దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని లిజ్ ట్రస్ తెలిపారు. అలాగే, 2024 ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘన విజయం సాధించేలా చేస్తామని చెప్పారు.